సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (16:59 IST)

రూ.2.40 లక్షలు.. ఆ మత్స్యకారుడి అదృష్టం పండింది.. కచ్చేళ్ళ చేప చిక్కింది..

Kachella
ఓ మత్స్యకారుడి అదృష్టం పండింది. రోజువారీ లాగే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు కచ్చేళ్ళ చేప రూపంలో అదృష్టం వలకు చిక్కింది. అయితే సోమవారం కచ్చేళ్ళ చేపను ఒడ్డుకు తీసుకొచ్చారు. దీనిని కొనుగోలు చేసేందుకు పలువురు పోటీ పడ్డారు.  
 
గోదారమ్మను నమ్ముకుని నదిలోకి చేపల వేటకు వెళ్లే జాలర్లకు అన్ని రోజులు ఒకేలా ఉండవు. మత్స్యకారులకు ఇది నిత్య పోరాటమే. ఆ తరహాలోనే నదిలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఊహించని అదృష్టం వారి వలకు చిక్కింది. 
 
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఫిషింగ్ హార్బర్‌లో వేటకు వెళ్లిన జాలర్లకు అరుదైన చేప చిక్కింది. దీనిని కొనుగోలు చేసేందుకు పలువురు పోటీ పడ్డారు. చివరకు అదే ప్రాంతానికి చెందిన దారకొండ అనే వ్యాపారి రూ.2.40 లక్షలకు దక్కించుకున్నారు. 
 
చేప జాతుల్లో దొరికే అరుదైన రకాల్లో ఈ కచ్చిలి చేప ఒకటి.. ఈ చేప పొట్ట భాగాన్ని మందుల తయారీలో వినియోగిస్తారని, అందుకే ఇంత గిరాకీ అని మత్స్యకారులు తెలిపారు. ఇప్పుడు గోదావరి తీరంలో ఇది పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది.