ప్రకాశం బ్యారేజ్ వద్ద గ్యాంగ్ రేప్: బాధితురాలి తల్లికి రూ. 5 లక్షల చెక్ అందించిన హోంమంత్రి సుచరిత
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార భాదితురాలిని హోంమంత్రి సుచరిత పరామర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల చెక్‌ను భాదితురాలి తల్లికి హోంమంత్రి అందించారు. హోం మినిస్టర్‌తో పాటు కలెక్టర్ వివేక్ యాదవ్, ఎమ్మెల్యే ముస్తఫా, ఇతర అధికారులు ఉన్నారు.
ఆ ఘటన నా మనసును కలచివేసిందన్న జగన్
ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ... '' ఈ ఘటన కలిచివేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాను. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవాంఛనీయ ఘటన మొన్న ప్రకాశం బ్యారేజీ వద్ద రాత్రిపూట జరిగింది.
ఇది నా మనసును చాలా కలిచి వేసింది. దీనికి చాలా చింతిస్తున్నాను, ఇలాంటి ఘటనలు ఎక్కడా జరక్కూడదు. మహిళలు అర్థరాత్రి పూట కూడా తిరగగలిగే పరిస్థితి ఉన్నప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని గట్టిగా నమ్మిన వ్యక్తిని. ఇలాంటి ఘటనలు జరగకుండా మీ అన్నగా, తమ్ముడిగా ఇంకా ఎక్కువ కష్టపడతాను'' అన్నారు జగన్.