మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 జూన్ 2021 (12:33 IST)

పదేళ్ల బాలికపై ఏడుగురి సామూహిక అత్యాచారం.. తండ్రి వీడియోను చూడటంతో..?

పదేళ్ల బాలికపై ఏడుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటన ఆ వీడియోను బాధితురాలి తండ్రి చూడటంతో వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఒకరికి 18 ఏళ్లు కాగా, మిగిలిన వారంతా మైనర్లు. ఈ ఘటన హర్యానా రాంపూరా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాంపూరా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఓ గ్రామానికి చెందిన 10 ఏళ్ల బాలిక మూడవ తరగతి చదువుతుంది. 
 
మే 24న ఆమె ఇంటి సమీపంలో నిర్మించిన పాఠశాలలో ఆడుకుంటుంది. చుట్టుపక్కల పిల్లలు కూడా అక్కడ ఆడుతున్నారు. అయితే కొందరు కలిసి బాలికపై బలవంతంగా సామూహిక అత్యాచారం చేశారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా రికార్డు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నిందితుల్లో ఒకరికి మాత్రమే 18 ఏళ్లు. మిగిలిన వారి వయసు 8 నుంచి 14 ఏళ్లలోపు మాత్రమే ఉంది.
 
ఈ నీచమైన చర్య వీడియోను నిందితులు ఒకరికొకరు వాట్సాప్‌లో షేర్ చేసుకున్నారు. అది కాస్తా బయటకు వచ్చింది. ఈ వీడియోను బాలిక తండ్రి దృష్టికి రావడంతో.. అతడు షాక్ తిన్నాడు. వెంటనే అతడు ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు. నిందితుల్లో ఇద్దరు బాధితురాలి కుటుంబానికి చెందినవారేనని పోలీసులు తెలిపారు. మిగిలినవారు కూడా వారి ఇంటికి సమీపంలో నివసించేవారేనని చెప్పారు.
 
ఇక, ఈ వీడియో ఎవరి ఫోన్ నుంచి వైరల్ అయింది.. అతడు ఎవరికి షేర్ చేశారనే విషయాల మీద కూడా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరైన 18 ఏళ్ల వ్యక్తిని కోర్టులో హాజరుపరిచినట్టుగా పోలీసులు చెప్పారు