మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 7 జులై 2016 (10:23 IST)

తూర్పుగోదావరి: ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్య.. కిడ్నీ వ్యాధులకు వైద్యం చేయించుకోలేక..?!

తూర్పుగోదావరి జిల్లాలో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. అమరవెల్లి గ్రామానికి చెందిన తాగల భూలక్ష్మీకి ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరంతా కొద్దికాలంగా రక్తహీన

తూర్పుగోదావరి జిల్లాలో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. అమరవెల్లి గ్రామానికి చెందిన తాగల భూలక్ష్మీకి ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరంతా కొద్దికాలంగా రక్తహీనత, కిడ్నీ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వ్యాధుల కారణంగా తరచూ రక్తం మార్పిడి చేసుకోవాల్సి వస్తుందనే ఆవేదనతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 
 
బుధవారం అర్ధరాత్రి ముగ్గురు కొడుకులతో కలిసి అమరవెల్లి సమీపంలోని ఉప్పుటేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలో భూలక్ష్మీ (45), ప్రభు ప్రకాష్‌ (22), అనిల్‌ (20), ప్రేమ ప్రకాష్‌ (17) ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇద్దరు కుమారులతో పాటు తల్లి కూడా కిడ్నీ వ్యాధితో బాధపడటంతో.. వైద్యం చేయించుకునే స్థోమత లేక వీరంతా ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెప్తున్నారు. అనిల్‌కుమార్‌, ప్రేమ్‌కుమార్‌కు రెండు కిడ్నీలు పూర్తిగా పాడైపోవడంతోనే ఇక బతికి ప్రయోజనం లేదని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.