మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By దేవి
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (16:17 IST)

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

Akhanda 2 – Balakrishna
Akhanda 2 – Balakrishna
నందమూరి బాలకృష్ణ ను అఖండ 2 – తాండవం లో బోయపాటి శ్రీను సరికోత్హగా చుపిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఇప్పడు మరో విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరిగుతుంది. దీనిపై మరో క్రేజీ గాసిప్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రలు చేస్తున్నాడు. ఒక పాత్ర నెగిటివ్, మరో పాత్ర పాజిటివ్ అని తెలుస్తోంది.  సహజంగా ఇంటర్వెల్ లోనే బాలయ్య రెండో పాత్ర రివీల్ అవుతుంది. ఇందులోనూ అదే జరుగుతుంది. కాగా, రెండో బాలయ్య సింపతి క్రియేట్ చేస్తుందని అంటున్నారు. 
 
ఈ సినిమాలో ఇప్పటికే పలు కీలక పాత్రల్లో ఇతర భాషల నటులను తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు.  థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను,  బాలయ్య, థమన్ కాంబినేషన్ మరో స్తాయిలో ఉంటుందో చూడాలి. ఐ ఇప్పటికే ప్రగ్యజైస్వాల్ నాయిక నటిస్తోంది. తమిళ నటుడు ఆదికీలక పాత్ర పోషిషున్నాడు. మరో నెగెటివ్ బాలయ్యకు ఛాన్స్ ఉందా లేదా కొద్దిరోజుల్లో తెలుస్తోంది.