శనివారం, 1 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 1 ఫిబ్రవరి 2025 (16:11 IST)

డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ పై సెన్సేషనల్ కామెంట్ చేసిన ఓంకార్

sekar mster, Ohmkar, Heroine Faria abdullah,
sekar mster, Ohmkar, Heroine Faria abdullah,
సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ తమన్‌, దర్శకుడు ఓంకార్‌, హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా, మాస్టర్‌ యష్‌, దీపికా రంగరాజ్‌, నటుడు మానస్‌, జాను, ప్రకృతి, పలువురు ప్రముఖుల ఆధ్వర్యంలో రూపొందిన డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 ఆహా ఓటీటీలో రాబోతుంది. ఈ సందర్భంగా డాన్స్ గురించి పంచబూతాల కాన్సప్ట్ తో చేస్తున్నట్లు ఓంకార్ తెలిపారు. శేఖర్ మాస్టర్ కూడా పాల్గొంటారు. ఇందులో ఓ డాన్సర్ చాక్ లెట్ తింటూ శేఖర్ మాస్టర్ దగ్గరకు వచ్చి ఆయన నోటిలో తన నోటితో పెట్టబోతుంది. దానిని సున్నితంగా తిరస్కరించ శేఖర్ మాస్టర్ కుర్చీలోంచి లేచిపోతాడు.
 
దీనిపై ఆయన ముందుకు వచ్చిన ప్రశ్నకు ఓంకార్ స్పందిస్తూ, ఇది కేజువల్ గా ఆ డాన్సర్ శేఖర్ మాస్టర్ దగ్గరకువచ్చి చాక్ లెట్ పెట్టబోయింది. ఇది కేవలం యాద్రుశ్చికమే ఇదికావాలని చేసింది కాదు. శేఖర్ మాస్టర్ చిన్నపిల్లవాడి మనస్తత్వం అందుకేవెంటనే లేచి వెల్ళిపోయారు. దీనిని గతంలో ఓ డాన్సర్ మాస్టర్ డాక్టర్ తో ముడిపెట్టవద్దని సూచించారు.
 
అదేవిధంగా డాన్స్ ప్రోగ్రామ్ లు అనేవి చూసేవారికి ఎంటర్ టైన్ చేయడానికే. ఈ ప్రోగ్రామ్ లు చూస్తూ, తమ పిల్లలని కూడా అలా చేయమని అడగడం చాలా రాంగ్. పిల్లలకు ఏది నచ్చితే అది చేయించాలి. కొందరికి రాయడం, కొందరికి పాడడం, కొందరికి డాన్స్ చేయడం.. ఇలా పిల్లల మనస్సులను తెలుసుకుని ప్రోత్సహించాలి. అంతేకానీ డాన్స్ ప్రోగ్రామ్ లు చూసి అలా నువ్వు కూడా వుండాలని బలవంతం చేయడం తల్లిదండ్రులు తప్పిదమే. ముందుగా వారు మారాలి. అప్పుడే సమాజం మారుతుంది అంటూ సెటైర్ వేశారు ఓంకార్.