బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 25 జూన్ 2018 (11:56 IST)

ప్రయాణంలో ఏర్పడిన స్నేహం.. ప్రేమగా మారింది.. ఆపై శారీరకంగా?

ప్రయాణంలో ఏర్పడిన స్నేహం.. ప్రేమగా మారింది. ఆపై శారీరకంగా కలిసింది. చివరికి పెళ్లి పేరెత్తగానే దూరమైంది. ఈ ఘటనలో నెల్లూరుకు చెందిన యువతి చివరికి మోసపోయింది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు ఆమెను మోసం

ప్రయాణంలో ఏర్పడిన స్నేహం.. ప్రేమగా మారింది. ఆపై శారీరకంగా కలిసింది. చివరికి పెళ్లి పేరెత్తగానే దూరమైంది. ఈ ఘటనలో నెల్లూరుకు చెందిన యువతి చివరికి మోసపోయింది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు ఆమెను మోసం చేసిన వ్యక్తి ఇద్దరూ నెల్లూరు జిల్లాకు చెందిన వారే.. ఇద్దరూ చెన్నైలో ఒకే కంపెనీలో పనిచేస్తుంటారు. దీంతో సహజంగానే వారి మధ్య పరిచయం స్నేహంగా మారింది. 
 
నిత్యమూ కలసి నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్లి, తిరిగి వచ్చే క్రమంలో అమ్మాయితో వచ్చేవాడు.. నెల్లూరుకు చెందిన నల్లమోలు దివ్యతేజ అనే యువకుడు. ఆపై ఇద్దరూ స్నేహితులయ్యారు. ఈ క్రమంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. 
 
పెళ్లి చేసుకుంటానని చెప్పిన తేజ, యువతిని శారీరకంగా లోబరచుకున్నాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని బాధితురాలు అడగటంతో దూరం పెట్టడం ప్రారంభించాడు. యువతి తన తల్లిదండ్రులకు విషయం చెప్పగా, వారు తేజ తల్లిదండ్రులను కలసి ఇద్దరికీ పెళ్లి చేద్దామని కోరారు. 
 
వారెవరూ పెళ్లికి అంగీకరించేది లేదని తెగేసి చెప్పేశారు. అంతటితో ఆగకుండా చంపేస్తామని బెదిరించారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా, దివ్యతేజతో పాటు ఆయన తల్లి, సోదరులపై కేసు పెట్టి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.