బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: గురువారం, 3 మే 2018 (13:54 IST)

సవతి తల్లితో అక్రమ సంబంధం.. ఆపై అనుమానంతో?

మానవ సంబంధాలను మంటగలిపేశారు. స్వయానా సవతి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆపై ఆమెను అనుమానించి హత్య చేసిన సంఘటన నెల్లూరు జిల్లా గడప మండలం అడవిపూడిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.... అడవిపూడి గ్రామానికి చెందిన సత్యనారాయణకు భానుమతికి వివాహమైంది. వీరికి

మానవ సంబంధాలను మంటగలిపేశారు. స్వయానా సవతి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకుని ఆపై ఆమెను అనుమానించి హత్య చేసిన సంఘటన నెల్లూరు జిల్లా గడప మండలం అడవిపూడిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.... అడవిపూడి గ్రామానికి చెందిన సత్యనారాయణకు భానుమతికి వివాహమైంది. వీరికి ఐదుగురు సంతానం. అనారోగ్యంతో భానుమతి చనిపోయింది. దీంతో సత్యానారాయణ రాజేశ్వరి అనే మరో మహిళను రెండవ పెళ్ళి చేసుకున్నాడు. ఈమెకు ముగ్గురు సంతానం.
 
రాజేశ్వరి విజయవాడలోని ఒక ఆశ్రమంలో పనిచేస్తోంది. వారానికి మూడురోజులు అక్కడే పనిచేసి వస్తుంది. అయితే సత్యనారాయణ కొడుకుల్లో రెండో వ్యక్తి కుమార్ రాజ పిన్నితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆరు నెలల పాటు వీరి మధ్య ఆ సంబంధం కొనసాగింది. ఐతే విజయవాడకు వెళ్ళి వస్తున్న రాజేశ్వరిపై కుమార్ రాజ అనుమానం పెట్టుకున్నాడు. విజయవాడలో మరొక వ్యక్తితో రాజేశ్వరి కలుస్తోందన్న అనుమానం పెట్టుకున్న కుమార్ రాజ పక్కా ప్లాన్ వేశాడు. 
 
పిన్నిని ఎలాగైనా చంపాలని, ఆమెకు పూటుగా మద్యం తాగించేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసి ఆపై బండరాయితో కొట్టి చంపేశాడు. ఆనవాళ్లు కనబడకుండా అక్కడే రాజేశ్వరిని పూడ్చేశాడు. అంతటితో ఆగలేదు పోలీస్ స్టేషనుకు వెళ్లి తన పిన్ని కనబడటం లేదంటూ ఫిర్యాదు కూడా ఇచ్చాడు. పోలీసులు రెండుమూడురోజులు వెతికి చివరకు అనుమానం వచ్చి కుటుంబ సభ్యులందరినీ విచారించారు. దీంతో కుమార్ రాజ బాగోతం బయటపడింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.