గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (11:17 IST)

సర్జరీ డెమో పేరుతో విద్యార్థినితో అసభ్య ప్రాక్టికల్స్... ప్రొఫెసర్‌ను చితక్కొట్టారు

జిల్లా కేంద్రమైన నెల్లూరులో ఓ వైద్య విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రొఫెసర్‌ను ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు పట్టుకుని రక్తంకారేవరకు చితక్కొట్టారు. సర్జరీ డెమో పేరుతో ఓ విద్యార్థిని పట్ల అసభ

జిల్లా కేంద్రమైన నెల్లూరులో ఓ వైద్య విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రొఫెసర్‌ను ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు పట్టుకుని రక్తంకారేవరకు చితక్కొట్టారు. సర్జరీ డెమో పేరుతో ఓ విద్యార్థిని పట్ల అసభ్య ప్రాక్టికల్స్ నిర్వహించాడు. దీంతో ఆ విద్యార్థిని ఎదురుతిరగడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. నెల్లూరు పట్టణంలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఇక్కడి ప్రభుత్వ వైద్య కాలేజీలో ఓ విద్యార్థిని మూడో సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతోంది. ఈమె పట్ల ఇక్కడ అసోసియేట్  ప్రొఫెసర్‌గా పనిచేసే చంద్రశేఖర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. సర్జరీ డిమోకు వెళ్లిన విద్యార్ధినిని అసభ్యంగా తాకుతూ వెకిలి వేశాలు వేశాడు. దీంతో ఈ విద్యార్ధిని కుటుంబ సభ్యులకు విషయాన్ని చేరవేశాడు. 
 
దీంతో ఆమె సోదరుడు మెడికల్ కాలేజీకి వెళ్లి ప్రొఫెసర్‌ను చితక బాదాడు. అదీకూడా మెడికల్ కాలేజీలో హెచ్.వో.డీల సమావేశం జరుగుతున్న సమయంలో మీటింగ్ హాల్లోకి వెళ్లిమరీ చితక్కొట్టాడు. దీంతో విషయం అందరికి తెలిసింది. బాధిత విద్యార్ధి అసోసియేట్ ప్రొఫెసర్ చంద్రశేఖర్‌పై ఫిర్యాదు చేసింది.