బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: సోమవారం, 21 మే 2018 (13:02 IST)

నువ్వు నాకు నచ్చావ్... చెల్లికి పెళ్లాయ్యాక మన పెళ్లి... ఇప్పుడు కలుద్దాం...

విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు కీచకుడిలా మారాడు. ఉస్మానియా యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన వద్ద రీసెర్చ్ స్కాలర్‌గా చేరిన యువతిని నమ్మించి వంచించాడు. వివరాల్లోకి వెళితే... ఉస్మానియా యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెస

విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు కీచకుడిలా మారాడు. ఉస్మానియా యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన వద్ద రీసెర్చ్ స్కాలర్‌గా చేరిన యువతిని నమ్మించి వంచించాడు. వివరాల్లోకి వెళితే...  ఉస్మానియా యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ తన వద్ద స్కాలర్‌గా చేరిన యువతిని కొద్ది రోజులకే నువ్వు నాకు బాగా నచ్చావంటూ వెంటపడ్డాడు. 
 
ఆ తర్వాత ఆమెను లొంగదీసుకుని లైంగికంగా వంచించాడు. పెళ్లి మాటెత్తితే తన చెల్లికి పెళ్లాయ్యాక చేసుకుందాం అంటూ ఆమెను మూడు సంవత్సరాల పాటు మోసం చేసాడు. అంతేకాకుండా బాధిత యువతి దగ్గర రూ. 25 లక్షల డబ్బు కూడా గుంజేశాడు. తీరా అతడి అసలు రంగు తెలుసుకున్న యువతి తన పెళ్లి గురించి, డబ్బు గురించి ఒత్తిడి చేసింది. దీనితో చంపేస్తానని బెదిరించాడు. మరోవైపు రహస్యంగా మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. 
 
తనకు జరిగిన అన్యాయంపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో ఐపీసీలోని 420, 323, 506, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసారు.