శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 14 జులై 2017 (12:41 IST)

కిరణ్ కుమార్ రెడ్డికి జనసేన నుంచి పిలుపు: సెకండ్ ప్లేస్ ఇచ్చేందుకు పవన్ రెడీ?

2019లో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెడీ అవుతున్నారు. సినిమాలన్నీ 2019 ఎన్నికల్లోపు పూర్తి చేసుకుని.. ఆపై పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలని పవర్ స్టార్ భావిస్త

2019లో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెడీ అవుతున్నారు. సినిమాలన్నీ 2019 ఎన్నికల్లోపు పూర్తి చేసుకుని.. ఆపై పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలని పవర్ స్టార్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డికి జనసేన నుంచి పిలుపు వెళ్ళిందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. 
 
రాష్ట్ర విభజన నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. ఆ పార్టీ ఎలాంటి ఫలితాలను రాబట్టలేకపోయింది. దీంతో, ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ప్రస్తుతం తన సొంత వ్యాపారాలను చూసుకుంటున్నారు. ఇటీవల ఆయన బీజేపీలో చేరనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ కిరణ్ కుమార్ రెడ్డిని తమ పార్టీలోకి తీసుకోవాలని పవన్ విశ్ర ప్రయత్నాలు చేస్తున్నారట.
 
పవన్ ఛరిష్మాకు కిరణ్ రాజకీయ అనుభవం తోడైతే.. రాజకీయాల్లో రాణించవచ్చునని, పవన్ భావిస్తున్నారట. కిరణ్‌కు జనసేనలో ఉన్నత స్థానం ఇవ్వాలని, పార్టీలో రెండో స్థానం ఆయనకే ఇవ్వాలని పవన్ భావిస్తున్నారట.
 
కిరణ్ కుమార్ రెడ్డి సన్నిహితులు, ఫ్యాన్స్ ఆయన్ని పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి వెళితే బాగుంటుందని సలహా ఇచ్చారట. రాష్ట్ర విభజన జరిగి రెండున్నర ఏళ్ళు గడిచిన కూడా.. విభజన వల్ల జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపిస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని ఉదాహరణగా కూడా చెప్పినట్టు తెలిసింది. దీనిపై స్పందించిన కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత నియోజక వర్గ ప్రజలు, అభిమానులు, సన్నిహితుల వద్ద చర్చించి తుది నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తారని సమాచారం.