సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By Srinivas
Last Modified: సోమవారం, 14 మే 2018 (21:25 IST)

డల్లాస్‌లో ప్రొఫెసర్‌గా చేస్తున్న కామారెడ్డివాసి వెంకట్రామిరెడ్డి మృతి... ఈతకెళ్లి...

ఈత అతడి ప్రాణాన్ని తీసింది. అమెరికాలో డల్లాస్‌లో నివాసముంటున్న 40 ఏళ్ల వెంకట్రామిరెడ్డి గ్లోబల్ ఐటీ కంపెనీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రిత స్నేహితులతో కలిసి బోట్ షికారుకు వెళ్లి ఈతకు వెళ్లిన సమయంలో నీటిలో మునిగి గల్లంతయ్యారు. ఆచూకి

ఈత అతడి ప్రాణాన్ని తీసింది. అమెరికాలో డల్లాస్‌లో నివాసముంటున్న 40 ఏళ్ల వెంకట్రామిరెడ్డి గ్లోబల్ ఐటీ కంపెనీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రిత స్నేహితులతో కలిసి బోట్ షికారుకు వెళ్లి ఈతకు వెళ్లిన సమయంలో నీటిలో మునిగి గల్లంతయ్యారు. ఆచూకి కోసం వెతికినా లభ్యం కాలేదు. రెండు రోజుల అనంతరం శవంగా తేలారు. 
 
కాగా వెంకట్రామిరెడ్డి స్వగ్రామం కామారెడ్డి జిల్లా అరేపల్లి. ఆయన భార్య వాణి కూడా డల్లాస్ లోనే ఉద్యోగం చేస్తున్నారు. మరో నెల రోజుల్లో స్వదేశంలో స్థిరపడాలని వారు అన్నీ పూర్తి చేసుకున్నారు. ఈ సమయంలో ఇలా దుర్ఘనలో ఆయన మృతి చెందారు.