శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 13 మే 2018 (15:15 IST)

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీ నారాయణ.. సంప్రదాయానికి విరుద్ధంగా..

సీనియర్ రాజకీయ నేత కన్నా లక్ష్మీ నారాయణను రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ నియమించింది. బీజేపీ తమ పార్టీ సంప్రదాయానికి భిన్నంగా కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా

సీనియర్ రాజకీయ నేత కన్నా లక్ష్మీ నారాయణను రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ నియమించింది. బీజేపీ తమ పార్టీ సంప్రదాయానికి భిన్నంగా కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన పార్టీ మరో నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఏపీ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా అధిష్టానం నియమించింది. 
 
ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ రాజకీయ నేత, మంచి వ్యూహకర్త, బలమైన కాపు సామాజిక వర్గం నాయకుడు అయిన కన్నా లక్ష్మీ నారాయణ రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీని ఒక గాడిలో పెడతారని బీజేపీ అధిష్టానం తమ పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి మరీ కన్నాను ఈ పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపీలో నెలకొన్న సామాజిక సమీకరణాల రీత్యా కన్నా లక్ష్మీనారాయణవైపే అమిత్ షా మొగ్గు చూపారు. ఒకవైపు కర్ణాటక ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్ర బీజేపీ నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా నియామకం జరగడం గమనార్హం.