శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 14 మే 2018 (10:13 IST)

కమల కిరీటం కన్నాకే... ఆ వెంటనే ముద్రగడ భేటీ...

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఆయన పేరును అధికారికంగా ప్రకటించిన కాసేపటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయనను కలిశారు. అభినందనలు తెలిపారు.

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఆయన పేరును అధికారికంగా ప్రకటించిన కాసేపటికే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయనను కలిశారు. అభినందనలు తెలిపారు. ఇటీవల అనారోగ్యానికి గురైన లక్ష్మీనారాయణను పరామర్శించడానికి వచ్చినట్లు ముద్రగడ తెలిపారు. ఈలోగా ఈ ప్రకటన రావడంతో అభినందనలు తెలిపినట్లు చెప్పారు. కాపు రిజర్వేషన్ల ప్రక్రియ అమలు కోసం బీజేపీ నేతలపైనా ఒత్తిడి తెస్తామన్నారు.
 
కాగా, తన నియామకంపై కన్నా లక్ష్మీ నారాయణ స్పందిస్తూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. రాష్ట్రంలో పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తా. రాష్ట్రాభివృద్ధి బీజేపీ ప్రభుత్వం వల్లే సాధ్యమని ప్రజలు నమ్మేలా చేస్తామని ప్రకటించారు. 
 
అంతేకాకుండా, విభజన చట్టం హామీల్లో 85 శాతం పూర్తి చేశాం. మిగతా 15 శాతం ఈ ఏడాదిలో నెరవేరుస్తాం. అలాగే, ఇవ్వని హామీలను కూడా ఎన్నో నెరవేర్చామన్నారు. వచ్చే 2019 ఎన్నికల నాటికి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాభివృద్ధికి ఏం చేసిందో ప్రజల కళ్లకు కట్టేలా చూపించి వారి ఎదుట నిలబడి ఓటు అడిగే స్థాయికి పార్టీని బలోపేతం చేస్తామని ఆయన ప్రకటించారు.