శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : ఆదివారం, 13 మే 2018 (14:54 IST)

కూల్... వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి... కాంగ్రెస్ కార్యకర్తలకు సిద్ధ పిలుపు

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే నరాలు తెగే ఉత్కంఠ కనబడుతోంది. భాజపా తమదే అధికారం అంటూ చిందులు వేసేస్తోంది. కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం చాలా కూల్‌

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే నరాలు తెగే ఉత్కంఠ కనబడుతోంది. భాజపా తమదే అధికారం అంటూ చిందులు వేసేస్తోంది. కానీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం చాలా కూల్‌గా వున్నారు. అంతేకాదు... పార్టీ కార్యకర్తలకు ఓ పిలుపు కూడా ఇచ్చారు. ఈ వీకెండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. 
 
ఎగ్జిట్ పోల్స్ అనేవి జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే. అవి మరో రెండ్రోజుల పాటు అందరికీ వినోదాన్ని పంచుతాయి. చెరువు లోతు 4 అడుగులు వుంటే 40 అడుగులు ఒకటి, కాదుకాదు 400 అడుగులు అని ఇంకొకటి... ఇలా ఎవరికి వచ్చినట్లు వారు రాసేసుకుంటుంటారు. కాబట్టి దాన్ని చక్కగా ఎంజాయ్ చేయండి అంటూ సిద్ధరామయ్య పిలుపునిచ్చారు.