శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: సోమవారం, 14 మే 2018 (17:55 IST)

ఎపిలో పార్టీ పరువు పోగొట్టారు - అధిష్టానంపై పురంధరేశ్వరి అలకపాన్పు?

భారతీయ జనతా పార్టీ అధిష్టానంపై అలకబూనారు మాజీ కేంద్రమంత్రి పురంధరేశ్వరి. పార్టీ నుంచి వెళ్ళిపోతామని బెదిరించే వారికి పదవులు ఇచ్చి పార్టీ పరువు పోగొడుతున్నారంటూ కోపంతో ఉన్నారామె. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీనే నమ్ముకుని ఉన్న వారికి బిజెపి అధ్యక్ష పదవ

భారతీయ జనతా పార్టీ అధిష్టానంపై అలకబూనారు మాజీ కేంద్రమంత్రి పురంధరేశ్వరి. పార్టీ నుంచి వెళ్ళిపోతామని బెదిరించే వారికి పదవులు ఇచ్చి పార్టీ పరువు పోగొడుతున్నారంటూ కోపంతో ఉన్నారామె. గత కొన్ని సంవత్సరాలుగా పార్టీనే నమ్ముకుని ఉన్న వారికి బిజెపి అధ్యక్ష పదవి ఇవ్వకుండా కన్నా లక్ష్మీనారాయణకు బాధ్యతలు అప్పజెప్పడం పురంధరేశ్వరికి ఏమాత్రం ఇష్టం లేదు.
 
నిన్న అమిత్ షా నుంచి అధికారిక ప్రకటన రాగానే పురంధరేశ్వరి తనకు పరిచయం ఉన్న కొంతమంది బిజెపి నేతలకు ఫోన్ చేశారట. ఎపిలో ఏం జరుగుతుందో తెలుసా.. ఇలా చేస్తే పార్టీని పటిష్టం చేయడం కష్టం. పార్టీ నుంచి వెళ్ళిపోవాలనుకున్న కన్నా లక్ష్మీనారాయణ పార్టీని వీడిపోతే మంచిదే అనుకోవాలి. అంతేగానీ ఆయన్ను పిలిచి బుజ్జగించి పార్టీ బాధ్యతలు అప్పజెబితే ఎలా. ఆయన ఒక నియోజకవర్గంలో మాత్రమే తిరిగి పార్టీని గెలిపించగలరేమో.. అంతేగానీ ఎపిలో ఆయనకు అస్సలు పట్టులేదు. 
 
మీరు ఏం ఊహించుకుని లక్ష్మీనారాయణకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పారంటూ తీవ్రస్థాయిలో పురంధరేశ్వరి మండిపడ్డారట. లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తితో తను కలిసి పనిచేయలేనని, పార్టీలోనూ ఉంటూ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తానని తేల్చి చెప్పేసిందట పురంధరేశ్వరి. ఈమె ఒక్కరే కాదు... కన్నా లక్ష్మీనారాయణను ఎపి బిజెపి అధ్యక్షుడిని చేయడం చాలామందికి ఇష్టం లేదట. మరి వారంతా ఒక్కరొక్కరుగా బయటకు వస్తారేమో చూడాలి.