శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 26 ఫిబ్రవరి 2022 (18:24 IST)

ఏపీ ఉద్యోగులకు షాక్ : 10.10 తర్వాత వస్తే వేతనంలో కోత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులంతా ఉదయం 10.10 గంటలలోపు ఆఫీసులకు రావాలని స్పష్టం చేసింది. లేనిపక్షంలో సెలవు పడిపోతుందని పేర్కొంది. ఉద్యోగులు ఖచ్చితంగా సమయపాలన పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇకపై ఆలస్యంగా విధులకు వస్తే మాత్రం ఆ రోజున లీవ్ పెట్టినట్టుగానే పరిగణించాల్సి వస్తుందని ఏపీ ప్రభుత్వం శనివారం ఏకంగా ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులంతా విధిగా 10 గంటల లోపు కార్యాలయాలకు రావాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఓ పది నిమిషాల వరకు ఆలస్యమైతే ఫర్వాలేదు కానీ, అంతకు ఒక్క నిమిషం ఆలస్యమైనా సెలవు పడిపోతుందని పేర్కొంది. 
 
అదేసమయంలో ఒక నెలలో ఉదయం 10.10 గంటల నుంచి 11 గంటల మధ్యలో కార్యాలయానికి వచ్చేందుకు మూడు సార్లు అనుమతి ఇస్తారు. ఆ పరిమితి దాటితే వేతనంలో కోత విధిస్తారని తెలిపింది. ఈ మేరకు ఏపీ ఆర్థిక శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.