బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 27 ఆగస్టు 2018 (16:27 IST)

బ్యూటీషియన్‌ పద్మ కేసు.. డబ్బుల కోసం ఆమె భర్తే పంపేవాడు..

బ్యూటీషియన్‌ పద్మపై హత్యాయత్నం కేసు కీలక మలుపు తిరిగింది. కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న నూతన్‌కుమార్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో పద్మ ప్రియుడిగా భావిస్

బ్యూటీషియన్‌ పద్మపై హత్యాయత్నం కేసు కీలక మలుపు తిరిగింది. కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న నూతన్‌కుమార్‌ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో పద్మ ప్రియుడిగా భావిస్తున్న నూతన్ కుమార్ భార్య సునీతను పోలీసులు విచారించారు. ఆమె తన భర్త ఆత్మహత్య  చేసుకోవడానికి పద్మనే కారణమని తెలిపింది. 
 
2012లో తమ వివాహం జరిగిందని, తన భర్త నూతన్ ఓ ప్రైవేటు షోరూంలో మేనేజర్‌‌గా పనిచేసేవారని.. ఆ సమయంలో తన భర్తతో పరిచయం పెంచుకుని పద్మ తన భర్తను లోబరుచుకుందని ఆరోపించారు. నూతన్ కుమార్ వద్ద ఉన్న డబ్బుల కోసం పద్మను ఆమె భర్త సూర్యనారాయణే పంపేవాడని నూతన్ కుమార్ భార్య సంచలన ఆరోపణలు చేసింది.
 
తన భర్తకు ఇష్టం లేకున్నా పద్మ వేధింపులకు గురిచేసిందని, విడాకులు తీసుకోవాల్సిందిగా నూతన్‌ను పద్మ హింసించిందని సునీత తెలిపింది. ఇదిలా ఉంటే.. నూతన్ కోసం పోలీసులు గాలించారు. కాగా, ఆదివారం నరసరావుపేట-గుంటూరు మార్గంలోని రైలు పట్టాలపై నూతన్‌కుమార్‌ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
 
మరోవైపు నాలుగేళ్లుగా బ్యూటీషీయన్ పద్మకు, నూతన్ కుమార్‌కు మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలిసిన సమయంలో  నూతన్ కుటుంబసభ్యులకు చెప్పి ఈ బంధాన్ని తెంచుకోవాలని కోరినట్టు సూర్యనారాయణ (పద్మ భర్త) చెప్పారు. పద్మతో నూతన్ కుమార్ వివాహేతర సంబంధం పెట్టుకొన్న విషయం తెలిసిన తర్వాత నూతన్ కుమార్‌కు ఆయన భార్య దూరంగా ఉంటున్నారు.
 
అయితే నూతన్ భార్య చేసిన ఆరోపణలను పద్మ భర్త సూర్యనారాయణ ఖండించాడు. ప్రతిసారీ తన బ్యాగులో విషం బాటిల్ పెట్టుకొని తాను సూసైడ్ చేసుకొంటానని నూతన్ బెదిరించి తమను బెదిరింపులకు గురిచేశాడని సూర్యనారాయణ చెప్పాడు. గతంలో కూడ నూతన్ కుమార్ ఆత్మాహత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు.