శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 25 ఆగస్టు 2018 (12:00 IST)

బ్యూటీషియన్‌పై హత్యాయత్నం.. ఓ ఇంట్లో కాళ్లు, చేతులు నరికివేయబడి..?

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కృష్ణాజిల్లా బాపులపాడులో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న పద్మ అనే బ్యూటిషయన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. అర్ధరాత్రి సమయంలో దాడ

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా కృష్ణాజిల్లా బాపులపాడులో దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న పద్మ అనే బ్యూటిషయన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు హత్యాయత్నం చేశారు. అర్ధరాత్రి సమయంలో దాడి చేసిన దుండగులు కాళ్లు కట్టేసి చేతులు నరికారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 
 
కొనఊపిరితో ఉన్న పద్మను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అయితే గత కొద్ది కాలంగా భర్తకు దూరంగా ఉంటూ... బాధితురాలు మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటమే ఈ ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. శనివారం ఉదయం ఓ ఇంట్లో కాళ్లు, చేతులు నరికివేయబడి, రక్తపు మడుగులో పద్మను స్థానికుల సహాయంతో 108 ద్వారా విజయవాడ ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా... ప్రియుడే ఆమెను హతమార్చేందుకు యత్నించి ఉంటాడని స్థానికులు తెలుపుతున్నారు. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.