డ్రైనేజీలో నవజాత శిశువు.. బురద, ధూళితో కనిపించింది..
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలోని ఓ ఆసుపత్రి సమీపంలోని కాలువలో ఆదివారం ఉదయం నవజాత బాలిక కనిపించింది. ఆమె కేకలు విన్న స్థానికులు పాపను రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. పాప బురద, ధూళితో నిండిపోయింది. స్థానికులు ఆమెను డ్రెయిన్‌లో నుంచి బయటకు తీసి గుడ్డలో చుట్టి ఆస్పత్రికి తరలించారు.
ఆరోగ్యంగా ఉన్న నవజాత బాలికను పాలమనేరు ఏరియా ఆసుపత్రిలోని న్యూబార్న్ స్టెబిలైజేషన్ యూనిట్‌లో ఉంచారు. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఓ మహిళ రక్తస్రావంతో ఆస్పత్రికి వచ్చిందని, అప్పుడే పుట్టిన తన బిడ్డ చనిపోయిందని చెప్పారని వైద్యాధికారి తెలిపారు. అయితే రెండు గంటల తర్వాత అదే పాపను ఆస్పత్రికి తీసుకొచ్చారన్నారు. "మేము శిశువును అబ్జర్వేషన్‌లో ఉంచాము. ఆమె బాగానే ఉంది" అని డాక్టర్ చెప్పారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నవజాత శిశువును కన్నతల్లి ఎందుకు డ్రైనేజీలో వేసిందనే దానిపై విచారణ జరుగుతోంది. బిడ్డ తల్లి వాష్‌రూమ్‌కు వెళ్లగా ప్రసవించిందని, పాపను అక్కడే వదిలేసిందని, పాపను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించామని, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని పోలీసులు చెప్పారు.