శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 3 జూన్ 2018 (15:22 IST)

శ్రీవారి ఆలయానికి జీఎస్టీ మినహాయింపు.. రూ.35కోట్ల ఆదా?

తిరుమల శ్రీవారి ఆలయానికి జీఎస్టీ మినహాయింపు ఇస్తూ కేంద్రం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా జీఎస్టీ పరిధి నుంచి టీటీడీకి మినహాయింపు ఇవ్వాలనే ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తికి కేంద్రం స్పందించింది. సేవా

తిరుమల శ్రీవారి ఆలయానికి జీఎస్టీ మినహాయింపు ఇస్తూ కేంద్రం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా జీఎస్టీ పరిధి నుంచి టీటీడీకి మినహాయింపు ఇవ్వాలనే ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తికి కేంద్రం స్పందించింది. సేవా భోజ్ యోజన పథకం కింద భక్తులకు ఉచిత అన్న ప్రసాదాలు అందించే ఆలయాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు పేర్కొంది. 
 
జీఎస్టీ మినహాయింపులో భాగంగా భక్తుల అన్నప్రసాదాల కోసం కొనుగోలు చేసే ముడి సరుకులపై ఇక నుంచి ఎలాంటి జీఎస్టీ వుండదు. అంతేగాకుండా.. జీఎస్టీ మినహాయింపు ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి ఏటా రూ.35కోట్ల వరకు ఆదా అవుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.