శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (12:45 IST)

ఆగస్టు వరకూ రైళ్ల రాకపోకలు లేనట్లే!

కరోనా ప్రభావం రైళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పూర్తి నిబంధనలతో దేశీయ విమానాల రాకపోకలకు అనుమతులు లభించినా... రైళ్లకు మాత్రం ఆగస్టు నెలాఖరు వరకూ అనుమతులు లభించనట్లు సమాచారం.

ఏప్రిల్ 14 లేదా అంతకు ముందు బుక్ చేసుకున్న అన్ని టిక్కెట్లను రద్దు చేయాలంటూ ఉన్నతాధికారులు ఇప్పటికే అన్ని జోన్లకూ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా వీరందరికీ కూడా డబ్బును రిఫండ్ చేసేయాలని కూడా సూచించారు. 
 
ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కొన్ని రైళ్లను ప్రత్యేక రైళ్లుగా గుర్తిస్తామని, అంతేకాకుండా 230 మెయిల్స్‌తో పాటు ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా నడుస్తున్నాయని అధికారులు ఓ రిపోర్టులో పేర్కొన్నారు. మామూలుగా అయితే 120 రోజుల ముందు నుంచే టిక్కెట్లను రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం నడుస్తున్న నిబంధనల ప్రకారం మాత్రం రైల్వే శాఖే గనుక రైళ్లను రద్దు చేస్తే ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు, అంతేకాకుండా వారి డబ్బులు కూడా వాపసు చేస్తోంది రైల్వేశాఖ.