కోవిడ్ రిపోర్టు తప్పుగా ఆర్థికంగా దెబ్బతీశారు... ఎన్ఆర్ఐ ఆస్పత్రిపై ఫిర్యాదు
కరోనా నెగిటివ్ వచ్చిన పాజిటివ్ గా తప్పుడు నివేదిక ఇచ్చి తనను మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎన్ఆర్ఐ ఆస్పత్రి వైద్యులు ఇబ్బంది పెట్టారని ఓ బాధితుడు ఆరోపించారు. ఈ వివరాల్లోకి వెళితే.. మంగళగిరి మండలం కాజా గ్రామానికి చెందిన కంకణాల శివ శంకర్ ఈనెల 20న ఎన్నారై ఆసుపత్రిలో కరోనా అనుమానంతో ఆర్టిపిసిఆర్ పరీక్ష చేయించుకున్నారు.
21వ తేదీ సాయంత్రం కరోనా పాజిటివ్‌గా నిర్ధారించి ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఈ నివేదికతో సంతృప్తి చెందని కంకణాల శివ శంకర్ 21వ తేదీన గుంటూరులోని ఆదిత్య హాస్పిటల్‌కి వెళ్లి సిటీ స్కాన్ ఇతర కోవిడ్ పరీక్షలు చేయించుకొన్నారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా లేదని నివేదిక వచ్చింది.
కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ అ వైద్య ఆరోగ్య శాఖ నుంచి కంకణాల శివ శంకర్‌కు ఫోన్ మెసేజ్ వచ్చింది. అప్పటికే ఒకరోజు కరోనా చికిత్స మందులు శివ శంకర్ వేసుకున్నారు.
అసలు తనకు కరోనా లేకున్నా ఉన్నట్లుగా తప్పుడు నివేదికను ఎన్ఆర్ఐ ఆస్పత్రి వైద్యులు ఇచ్చారని దీంతో తాను రెండు రోజులుగా తీవ్ర మానసిక వేదన చెందానని చెప్పారు. తప్పుడు నివేదిక తో తనను తీవ్ర క్షోభకు గురి చేసిన ఎన్నారై ఆసుపత్రి పై చర్యలు తీసుకోవాలని కణాల శివ శంకర్ డిమాండ్ చేశారు.