శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 23 ఫిబ్రవరి 2017 (11:48 IST)

అద్దెకుంటున్నారా? పడకగదిలో కెమెరాలు పెట్టేస్తున్నారు.. జాగ్రత్త..

హైదరాబాదులో అద్దెకుంటున్నారా? జరజాగ్రత్త.. పడకగదిలో కెమెరాలు పెట్టేస్తున్నారట. ఈ వ్యవహారం హైద‌రాబాద్‌లోని చాంద్రాయణగుట్టలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వెలుగులోకి వచ్చింది. ఇంటి ఓనర్ నీచమైన చేష్టల బండారం బట్ట

హైదరాబాదులో అద్దెకుంటున్నారా? జరజాగ్రత్త.. పడకగదిలో కెమెరాలు పెట్టేస్తున్నారట. ఈ వ్యవహారం హైద‌రాబాద్‌లోని చాంద్రాయణగుట్టలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వెలుగులోకి వచ్చింది. ఇంటి ఓనర్ నీచమైన చేష్టల బండారం బట్టబయలైంది. త‌మ అపార్ట్‌మెంట్ల‌లో కిరాయికి ఉంటున్న వారికి తెలియ‌కుండా బెడ్రూంలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఇంటీరియర్ డిజైన్ కీబోర్డులో వాటిని ఎవ‌రికీ క‌నిపించ‌కుండా పెట్టాడు. 
 
ఈ కెమెరాల ద్వారా అద్దెదారులకు తెలియకుండానే వారి వ్యవహారాలను రికార్డు చేశారు. అయితే ఓ అద్దెదారుడు ఈ విషయం గుర్తించడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడు విజయ్ నంద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. స‌ద‌రు య‌జ‌మాని ఇంటిలోని గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులోని బెడ్‌రూంలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడని పోలీసులు చెప్పారు.