శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 26 జులై 2024 (11:33 IST)

జగన్‌ ఒక కొలంబియా మాఫియా కింగ్ పాబ్లో ఎస్కొబార్‌ : సీఎం చంద్రబాబు

Chandra babu
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని కొలంబియాకు చెందిన మాఫియా కింగ్ మాబ్లొ ఎస్కొబార్‌ గవేరియాతో ఏపీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు పోల్చారు. ఏపీలో అసెంబ్లీలో శాంతిభద్రతలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన 40 యేళ్ల రాజకీయ జీవితంలో జగన్ వంటి నేతను ఎక్కడా చూడలేదన్నారు. అందుకే ఆయన్ను ఎస్కొబార్‍‌తో పోల్చుతున్నట్టు చెప్పారు. 
 
పాబ్లొ ఎస్కొబార్ గవేరియా కొలంబియా దేశానికి చెందిన డ్రగ్ లార్డ్. అతడొక నార్కో టెర్రరిస్ట్. ఘోరమైన విషయం ఏమిటంటే... అలాంటి వ్యక్తి రాజకీయ నేతగా మారాడు. 
 
మాదక ద్రవ్యాల అమ్మకాన్ని మరింత విస్తరించాడు. ఆ సమయంలో అతడు సంపాదించిన సొమ్ము అక్షరాలా రూ.2.51 లక్షల కోట్లు. ఇపుడా సొమ్ము విలువ రూ.7.54 లక్షల కోట్లు. కేవలం డ్రగ్స్ విక్రయించి అంత సొమ్మును సంపాదించాడు. 
 
జగన్ కూడా టాటా, అంబానీలను మించి ధనవంతుడు కావాలనుకుంటున్నాడు. కొందరికి అవసరాలు ఉంటాయి. కొందరికి దురాశ ఉంటుంది. ఇంకొందరికి వెర్రి వ్యామోహం ఉంటుంది. ఆ వెర్రి వ్యామోహం ఉన్నవాళ్లు ఏమైనా చేస్తారు. అంలాటి వ్యక్తే ఈ జగన్మోహన్ రెడ్డి అని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.