పతంజలి ప్రొడక్ట్స్ 'మాయ'... 2016 అక్టోబరు తయారు చేశారట... ముందుగానే మార్కెట్లోకి... ఎలాగబ్బా?
విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా ఇపుడు ఎంతో క్రేజ్ ఉన్న ప్రొడక్ట్ ఆయుర్వేదం. అందులో ఎవరికీ అందనంత వ్యాపారాత్మకంగా ఎదిగిన వ్యక్తి బాబా రాందేవ్. ఆయన తయారుచేస్తున్న పతంజలి ఆయుర్వేదం ప్రోడక్స్ట్ ఇ
విజయవాడ: ప్రపంచవ్యాప్తంగా ఇపుడు ఎంతో క్రేజ్ ఉన్న ప్రొడక్ట్ ఆయుర్వేదం. అందులో ఎవరికీ అందనంత వ్యాపారాత్మకంగా ఎదిగిన వ్యక్తి బాబా రాందేవ్. ఆయన తయారుచేస్తున్న పతంజలి ఆయుర్వేదం ప్రోడక్స్ట్ ఇపుడు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడువుతున్నాయి. భవిష్య మార్కెట్ అంతా పతంజలిదే అనే టాక్ బిజినెస్ వరల్డ్‌లో ఇప్పటికే వచ్చేసింది. అటు యోగాలోను, ఇటు ఆయుర్వేద మార్కెట్లోనూ బాబా రామ్ దేవ్ వేల కోట్ల మార్కెట్ మించిపోయారు.
ఇంతటి బ్రాండ్ వేల్యూ ఉన్న పతంజలి ప్రొడక్ట్‌లోని ఈ మాయాజాలాన్ని మీరే చూడండి. ఇక్కడ చూపిస్తున్న ఆయుర్వేదం ప్రొడక్ట్ తయారీ తేదీ అక్టోబరు 20, 2016 అట. ఇక దీని ఎక్స్పైరీ డేట్ 19 అక్టోబరు 2017 అట. గత మూడు, నాలుగు నెలులగా మార్కెట్లో ఉన్న ఈ ప్రొడక్ట్ తయారీ తేదీ ఆరేడు నెలలు ముందు వేసేసి మార్కెట్లో వినియోగదారులను మోసం చేస్తున్నారని ఈ డబ్బాను చూస్తే తెలుస్తుంది.
ఆయుర్వేదం స్టోర్‌లో మూడు నెలల నుంచి ఉన్న ఈ సీసా మ్యాన్యుఫార్చరింగ్ డేట్ అక్టోబరు 20 ఎలా వేస్తారు? పతంజలి వంటి ప్రెస్టేజియస్ సంస్థ ఇలా జనాల్ని మోసగించవచ్చా...? బాబా రామ్ దేవ్ గారూ మీరే ఆలోచించండి... ఈ డేట్ వేసింది సంస్థనా.. లేక ఉత్పత్తులను అమ్ముతున్న దుకాణమా...?