బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 21 డిశెంబరు 2016 (16:01 IST)

మీ హితబోధ నాక్కాదు... తెలివితక్కువగా నోట్ల రద్దు చేసినవాళ్లకి చెప్పండి... పవన్ ఫైర్

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ ద్వారా ఏపీ భాజపా చీఫ్ సిద్ధార్థ్ నాథ్ సింగుపైన మండిపడ్డారు. తనకు విషయ పరిజ్ఞానం లేదంటూ సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... హితబోధ నాక్కాదు, తెలివితక్కువగా నోట్లు రద్దు చేసి అమాయకుల ప్రాణాలను బలిగొన్న మీ

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరోసారి ట్విట్టర్ ద్వారా ఏపీ భాజపా చీఫ్ సిద్ధార్థ్ నాథ్ సింగుపైన మండిపడ్డారు. తనకు విషయ పరిజ్ఞానం లేదంటూ సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... హితబోధ నాక్కాదు, తెలివితక్కువగా నోట్లు రద్దు చేసి అమాయకుల ప్రాణాలను బలిగొన్న మీ నేతలకు చెప్పండి. అసలు మీ పార్టీ ఎన్నో దశాబ్దాలుగా ఉన్నది కదా... ఇలాంటి తప్పుడు నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారు అంటూ ప్రశ్నించారు. 
 
కాగా మొన్న పవన్ చేస్తున్న ట్వీట్లపై సిద్ధార్థ్ వ్యాఖ్యానిస్తూ... పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా ట్వీట్లు చేస్తున్నారని విమర్శించారు. ఏదైనా ట్వీట్ చేసేటపుడు ఆ అంశంపైన లోతుగా పరిశీలించి చేయాలని, అవగాహన లేకుండా ఏదో ఒకటి చేయడం మానుకోవాలని అన్నారు. దీనికి పవన్ కౌంటర్ ఇచ్చారు.