గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (09:20 IST)

కిరాయి గూండాలు బ్లేడ్లతో దాడి చేస్తున్నారు.. జాగ్రత్త: పవన్ కల్యాణ్

Pawan Kalyan
Pawan Kalyan
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన నాయకులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ అందరినీ కలవాలని తన కోరికను వ్యక్తం చేశారు. పిఠాపురం ప్రజలు.. ప్రతి ఒక్కరితో ఫోటో దిగాలని పవన్ చెప్పారు.
 
అయితే ప్రోటోకాల్ పాటించడం ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. ప్రోటోకాల్‌ను పాటించడంలో విఫలమైతే సమస్యలు తలెత్తుతాయని పవన్ పేర్కొన్నారు.ఇటీవల తనను కలిసేందుకు పెద్ద సంఖ్యలో జనం వచ్చినప్పుడు, వారిలో కిరాయి గూండాలు చొరబడి భద్రతా సిబ్బందిపై పలుచని బ్లేడ్లతో దాడి చేశారని, తనపై కూడా దాడి చేశారని పవన్ వెల్లడించారు. 
 
పిఠాపురంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుందని పవన్ ఫైర్ అయ్యారు. అందువల్ల అందరినీ కలవడం కష్టంగా మారిందని వివరించారు. ప్రత్యర్థి పార్టీ వ్యూహాలు అందరికీ తెలిసిందే కాబట్టి జాగ్రత్తగా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరారు.