మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (08:19 IST)

పవన్ కళ్యాణ్‌కు స్వల్ప అస్వస్థత : ఆస్పత్రిలో పరీక్షలు..

పవర్ స్టార్ పవన కళ్యాణ్‌ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఆయన ఊపిరితిత్తులు స్వల్పంగా ఇన్ఫెక్షన్ చేసినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో ఆయన వైద్యులు చికిత్స చేస్తున్నారు. 
 
ఇటీవల తన కార్యాలయ సిబ్బందికి కరోనా వైరస్ సోకిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ శ్వాసపీల్చడంలో ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. 
 
ఈ పరీక్షల్లో ఆయనకు ఊపిరితిత్తులు స్వల్పంగా ఇన్ఫెక్షన్‌కు గురైనట్టు తేలింది. దీంతో ఆయన వైద్యులు పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన వకీల్ సాబ్ ప్రీరిలీజ్ వేడుకల్లో పాల్గొన్న నిర్మాత బండ్ల గణేష్‌కు కూడా కరోనా రెండోసారి సోకిన విషయం తెల్సిందే.