శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2025 (17:06 IST)

Pawan Kalyan: క్షమాపణ చెప్తే తప్పేంటి? అమ్మాయిల దగ్గర మగతనం చూపిస్తే నార తీస్తాం: పవన్ (video)

Pawan kalyan
Pawan kalyan
తిరుమల తొక్కిసలాట ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విషాద ఘటనపై టీటీడీ ఛైర్మన్, సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలని సూచించారు. తానే క్షమాపణ చెప్పినప్పుడు... మీకు చెప్పడానికి నామోషీ ఏమిటని ప్రశ్నించారు. 
 
తాను మాత్రమే దోషిగా నిలబడాలా? అని ప్రశ్నించారు. వీఐపీ ట్రీట్మెంట్ తగ్గించాలని... కామన్ మేన్ ట్రీట్మెంట్ పెంచాలని చెప్పారు. 15 ఏళ్లకు తక్కువ కాకుండా కూటమి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. తనకు డబ్బు, పేరు మీద ఇష్టం లేదని... తనకు బాధ్యత మాత్రమే ఉందని అన్నారు. పిఠాపురం నుంచి జిల్లాల పర్యటనను మొదలు పెడతానని చెప్పారు. 
 
వైసీపీ పాలనలో 268 గోకులం షెడ్లను నిర్మిస్తే... ఈ ఆరు నెలల్లో తమ ప్రభుత్వంలో 12,500 షెడ్లను నిర్మించామని తెలిపారు. భవిష్యత్తులో 20 వేల గోకులాలను నిర్మిస్తామని చెప్పారు. అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేస్తే మగతనం కాదు.. అమ్మ లేనిదే సృష్టి లేదని పవన్ అన్నారు. 
 
మగతనం చూపించాలంటే జిమ్నాస్టిక్స్ చేయండి, ఆర్మీలో చేరండి.. అంతేకానీ అమ్మాయిల దగ్గర మగతనం చూపిస్తే తొక్కి నారా తీస్తామని హెచ్చరించారు. క్రిమినల్స్‌కి కులం లేదు.. ప్రజాప్రతినిధులకు కులం లేదు.. తప్పు చేసిన ఎవడినైనా శిక్షించండి అంటూ పవన్ పేర్కొన్నారు.