బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2019 (08:40 IST)

జె ట్యాక్స్ కోసం లోటస్ పాండ్ నుంచి ఫోన్లు.... ట్విట్టర్ లో నారా లోకేష్

జె ట్యాక్స్ కట్టాల్సిందేనని వెళ్తున్నాయని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. "సంపూర్ణ మద్యపాన నిషేధం పేరుతో స్కీం, జగనన్న మద్యం దుకాణం మాటున స్కామ్ అదిరింది జగన్ గారు.

ప్రభుత్వ మద్యం దుకాణంలో తమ బ్రాండ్ ఉండాలి అంటే జె ట్యాక్స్ కట్టాల్సిందేనని లోటస్ పాండ్ ఇంటి నుండి లిక్కర్ కంపెనీలకు ఫోన్లా? పైగా ఇదంతా మా అక్కచెల్లెళ్ళ కోసం అంటూ బిల్డప్పా? గ్రేట్ జగన్ గారు" అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

అదేవిధంగా మరో ట్వీట్ లో "జగన్ వచ్చారని... వరుణుడు పారిపోయాడా? సాగునీరు రాక ఉత్తరాంధ్ర ఉసూరుమంటోంది. చినుకు రాలక రాయలసీమ రాళ్లసీమలా కనిపిస్తోంది. గుక్కెడు నీటి కోసం ప్రకాశం ప్రజలు రోడ్డెక్కుతున్నారు. తమ వల్లే వానొచ్చిందని, వరదొచ్చిందంటూ వైకాపా నేతలు మా జగనన్న భగీరధుడు అంటూ బిల్డప్ ఇస్తున్నారు.

ఇప్పటి వరకూ 3 జిల్లాల్లోనే సాధారణ, 10 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాలలో తాగేందుకు నీరివ్వమంటూ జనాలు ఆందోళనకు దిగుతున్నారు. మరి వరుణుడు ఏమయ్యాడు, జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు అని తెలిసిపోయి పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాడా?

వైకాపా మేధావులు మాత్రమే సమాధానం చెప్పాలి" అని ఎద్దేవా చేశారు. లోకేష్ ట్వీట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.