తిరుపతి సైన్స్ కాంగ్రెస్‌లో గవర్నర్‌ను అవమానించిన ప్రధాని మోడీ, ఏం చేశారో తెలుసా?
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సైన్స్ కాంగ్రెస్‌లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌కు అవమానం జరిగింది. గవర్నర్‌కు ఏంటి అవమానం అనుకుంటున్నారా... అయితే ఇది చదవాల్సి
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సైన్స్ కాంగ్రెస్‌లో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌కు అవమానం జరిగింది. గవర్నర్‌కు ఏంటి అవమానం అనుకుంటున్నారా... అయితే ఇది చదవాల్సిందే.
ప్రతి విద్యార్థికి సైన్స్‌పై మరింత అవగాహన కల్పించేందుకు కేంద్రంప్రభుత్వం సైన్స్ కాంగ్రెస్‌ను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కార్యక్రమానికి గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు పాల్గొన్నారు.
సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రధాని, గవర్నర్‌లు ఇద్దరూ రెండు వైపులా కూర్చున్నారు. గవర్నర్ నరసింహన్ సమావేశం మొదటి నుంచి నాలుగుసార్లు ప్రధానితో మాట్లాడేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. సర్, సర్ అంటూ ఆయనతో మాట కలిపే ప్రయత్నం చేశారు. అయితే గవర్నర్ పిలిచిన ప్రతిసారీ మోడీ అటుఇటు తిరుగుతూ ఉండిపోయారు.
దీంతో గవర్నర్ ఏం చేయాలో పాలుపోక నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు. సభాస్థలిపై గవర్నర్ ప్రధానిని అన్నిసార్లు పిలుస్తున్నా పట్టించుకోకపోవడాన్ని సభికులు ఆశ్చర్యంగా తిలకించారు. కారణమేంటి... ఇ.ఎస్.ఎల్.నరసింహన్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా గవర్నర్‌గా ఆయన కొనసాగుతున్నారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరసింహన్ పదవి పోవడం ఖాయమని అనుకున్నారు. అయితే మోడీతో గతంలో నరసింహన్‌కు ఉన్న పరిచయం కాస్త ఆ పదవిలో ఆయననే కొనసాగిస్తూ వచ్చారు. ఎన్నోసార్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను ప్రధానికి వివరిస్తూ వచ్చారు గవర్నర్. అయితే ప్రస్తుతం గవర్నర్‌ను ప్రధాని పట్టించుకోవకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. దీనికి కారణం తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ను నియమించే పనిలో కేంద్రం నిమగ్నమవుతున్నట్టు అర్థం చేసుకోవచ్చా...?