Daily Horoscope
✕

బోరుగడ్డ అనిల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకని?

Written By సెల్వి
Updated: గురువారం, 17 అక్టోబరు 2024 (09:07 IST)
Borugadda Anil Kumar
బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి పట్టాభిపురం పోలీసులు అనిల్‌ను ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పే అనిల్‌ను బెదిరింపుల కేసులో అరెస్ట్ చేశారు. 
 
2021లో కర్లపూడి బాబుప్రకాష్‌ను రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించిన కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బాధితుడి ఫిర్యాదు మేరకు అనిల్‌పై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న నిందితుడిని బుధవారం నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లిన అనిల్‌ను గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు.
 
బోరుగడ్డ అనిల్‌పై గత ఐదేళ్లలో ఎన్నో అరాచకాలు చేశారని టీడీపీ ఆరోపించింది. అలాగే సోషల్ మీడియా వేదికగా దూషణలకు దిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

అన్నీ చూడండి

Rashmika: మైసా నుంచి విలువైన బంధాన్ని సెలబ్రేట్ చేసే మెలోడీ ఏనాటి వరమో నువ్వు రిలీజ్

Schola : డ్రగ్ మాఫియా నేపథ్యంతో స్కాలర్ సినిమా ఫస్ట్ లుక్

Suman: కాంతారావుగారి మాట ప్రకారం ఆ తప్పు చేయలేదు - హీరో సుమన్

Madura Audio: నీకై పరుగిడి పార్థు, వెంకటలక్ష్మిల ప్రణయగీతం

Mytri movies Varanasi : టామ్ క్రూయిజ్ తరహాలో మహేష్ బాబు పాత్ర ? ₹300 కోట్లకు వారణాసి హక్కులు

తర్వాతి కథనం
Show comments