మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 13 జనవరి 2022 (09:32 IST)

ప్ర‌ధాని మోదీ నేడు ముఖ్యమంత్రుల స‌మావేశం... లాక్ డౌన్ లా? ఆంక్ష‌లా?

ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ -19 కొత్త వేరియంట్ ఓమిక్రాన్ విపరీతంగా పెరిగిపోతోంది. మ‌న దేశంలోనూ గ‌త 10 రోజులుగా కేసుల సంఖ్య తార స్థాయికి చేరుతోంది. దీనితో పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఈ సాయంత్రం 4గంటల 30నిమిషాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.
 
 
కొద్ది రోజులుగా లక్షపైనే కేసులు నమోదు అవుతుండగా, కొత్త కేసుల సంఖ్య లేటెస్ట్‌గా రెండు లక్షలకు చేరుకుంది. ప్రతిరోజూ 400మందికి పైగా కరోనాతో చనిపోతున్నారు. దేశంలో పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. ఈ క్రమంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఇందులో ఆయ‌న ఎటువంటి సూచ‌న‌లు చేస్తార‌నే దానిపై ఆస‌క్తి నెల‌కొంది.


కోవిడ్ ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠిత‌రం చేస్తారా?  లేక తిరిగి లాక్ డౌన్ ప్ర‌క‌టించే దిశ‌లో ఆలోచ‌న చేస్తారా? అనే చ‌ర్చ మొద‌లైంది. ఇప్ప‌టికే కొన్ని రాష్ట్రాలు నైట్ లాక్ డౌన్, సెమీ లాక్ డౌన్ లోకి వెళుతున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా రాత్రి పూట క‌ర్ఫ్యూ ప్ర‌క‌టించారు. ఇపుడు దేశ ప్ర‌ధానితో చ‌ర్చించిన అనంత‌రం ఎలాంటి నిర్ణ‌యాలుంటాయో అనే టెన్ష‌న్లో దేశ ప్ర‌జ‌లున్నారు.