బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2017 (10:09 IST)

చంద్రబాబుది పాత మూసే.. జగన్‌ ఆ కేసులతో?: హరగోపాల్

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తరహా సినిమా నుంచి రాజకీయాల్లో వచ్చిన నేతలు ప్రజలను ప్రభావితం చేయలేకపోయారని తాను భావిస్తున్నట్లు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మెగాస్టార

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తరహా సినిమా నుంచి రాజకీయాల్లో వచ్చిన నేతలు ప్రజలను ప్రభావితం చేయలేకపోయారని తాను భావిస్తున్నట్లు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి తనతో పార్టీ పెట్టేందుకు ముందు చర్చించారని.. మదర్ థెరిస్సాతో స్ఫూర్తి చెంది పార్టీ పెట్టబోతున్నాని తెలిపారన్నారు. 
 
పవన్ కూడా ఏదో చేయాలని ఉబలాటం ఆయనలో వుందని హరగోపాల్ తెలిపారు. ఇక ఏపీ రాజకీయాల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసేది పెద్దగా ఏమీ లేదన్నారు. ఓ వెబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. చంద్రబాబు ఇప్పటికీ పాత మూస పద్ధతిలోనే పరిపాలన సాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంలో ఆయనలో మార్పు రావట్లేదని చెప్పుకొచ్చారు. ప్రజా సంక్షేమంపై ఆయన సరైన విధంగా దృష్టిని సారించలేకపోతున్నారని పేర్కొన్నారు. 
 
ఏపీలో పెద్ద సంఖ్యలో ఓటు బ్యాంకున్న క్రిస్టియన్లు, దళితులకు దగ్గర కావడం తెలుగుదేశం పార్టీ చేతకావడం లేదని తెలిపారు. ఇదే సమయంలో వైఎస్ జగన్‌ను ప్రస్తావిస్తూ, తనపై ఉన్న అక్రమ కేసులు జగన్‌కు ప్రతిబంధకాలని తెలిపారు. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను కేసులు జగన్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయని తెలిపారు. ఈ కేసులన్నింటి నుంచి బయటపడటం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని పేర్కొన్నారు. 
 
ఈ కేసులపై కేంద్ర ప్రభుత్వం జగన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటే చెప్పలేమని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చే రాజకీయ నాయకుల ప్రాభవం తగ్గిపోయిందన్నారు. అలాగే ఏపీలోనూ సినీ జనం.. రాజకీయాల్లోకి వస్తారంటే ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోకపోవచ్చునని చెప్పుకొచ్చారు.