ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 31 అక్టోబరు 2017 (21:20 IST)

పట్టు కోసం ప్రయత్నం చేస్తున్న పురంధేశ్వరి... కాంగ్రెస్ లీడర్స్ కోసం...

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు కుమార్తెగా పురంధేశ్వరికి మంచి పేరే ఉంది. మాజీ కేంద్రమంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి దేని గురించి అయినా అనర్గళంగా మాట్లాడే సత్తా ఉంది. అందుకే భారతీయ జనతాపార్టీలో కీలక మహిళా నేతగా ప్ర

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు కుమార్తెగా పురంధేశ్వరికి మంచి పేరే ఉంది. మాజీ కేంద్రమంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి దేని గురించి  అయినా అనర్గళంగా మాట్లాడే సత్తా ఉంది. అందుకే భారతీయ జనతాపార్టీలో కీలక మహిళా నేతగా ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. పార్టీలో పెద్దగా పదవులు లేకపోయినా, పార్టీ కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొంటున్నారు పురంధేశ్వరి. 
 
ఏపీలో భారతీయ జనతాపార్టీని మరింత ముందుకు దూసుకెళ్ళేందుకు పురంధేశ్వరి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేంద్ర నాయకత్వం ఆదేశాలతో ఎపిలో ఖాళీగా ఉన్న సీనియర్ రాజకీయ నేతలను బిజెపి వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులోను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన సి.కె.బాబును బిజెపిలోకి ఆహ్వానించే ప్రయత్నం పురంధేశ్వరి చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. 
 
చిత్తూరు జిల్లాలోనే కాదు.. ఇతర జిల్లాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న సి.కె.బాబును బిజెపిలో చేర్చుకుంటూ పార్టీ పటిష్టతకు ఆయన బాగా కృషి చేస్తారన్నది పురంధేశ్వరి ఆలోచన. గత కొన్నినెలలుగా రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటూ వచ్చిన సి.కె.బాబు ఇప్పుడు ఏదో ఒక పార్టీలో చేరాలన్న ఆలోచనలో ఉన్నారు. సి.కె.ను బిజెపి తీర్థం పుచ్చుకునేలా చేసేందుకు పురంధేశ్వరి ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే సి.కె.బాబు బిజెపిలో చేరుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా ఎపిలో కూడా సీనియర్ రాజకీయ నాయకులుగా పనిచేసి ప్రస్తుతం ఏ పార్టీలో లేని వారిని బిజెపిలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు పురంధేశ్వరి.