రాహుల్ గాంధీ "పప్పు" అన్నదెవరో తెలుసా? కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడే...
ఈ పప్పు వ్యవహారం ఈమధ్య ఎక్కువైపోయింది. సహజంగా తెలివితక్కువ వారిని పప్పు, మొద్దు, బండ అంటూ నానా రకాలుగా తెలుగులో సంబోధిస్తుంటారు. ఐతే పప్పూ అనేది హిందీలో పిల్లవాడని అంటారట... అంటే, యువకుడు అని అర్థం చేసుకోవాలట. ఐతే ఇది పెడార్థం అని కాంగ్రెస్ పార్టీ నా
ఈ పప్పు వ్యవహారం ఈమధ్య ఎక్కువైపోయింది. సహజంగా తెలివితక్కువ వారిని పప్పు, మొద్దు, బండ అంటూ నానా రకాలుగా తెలుగులో సంబోధిస్తుంటారు. ఐతే పప్పూ అనేది హిందీలో పిల్లవాడని అంటారట... అంటే, యువకుడు అని అర్థం చేసుకోవాలట. ఐతే ఇది పెడార్థం అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇప్పుడు ఈ పప్పు పదమే పార్టీ జిల్లా అధ్యక్షుడి పదవిని ఊడేట్లు చేసింది.
వివరాల్లోకి వెళితే.... ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి వెలువడిన ఒక పోస్టు వివాదాన్ని సృష్టించింది. జిల్లా అధ్యక్షుని పేరుతో వెలువడిన ఈ పోస్టులో రాహుల్ గాంధీని రైతు నేతగా, జనాదరణ పొందిన యువనేతగా అభివర్ణిస్తూనే ఆయన పేరుతో పాటుగా పప్పూ అని కూడా జోడించేశారు. ఇది వినయ్ ప్రధాన్ పేరుపై వుంది.
ఆ పోస్టు చూసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. వెంటనే ఆయన్ను అన్ని పదవుల నుంచి తప్పించడమే కాకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వినయ్ మాత్రం ఆ పోస్టు తాను చేయలేదని లబోదిబోమంటున్నారు. తన వివరణ కూడా తీసుకోకుండా పార్టీ తనను ఇలా బలిపశువును చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఎవరైనా ఆయనకు కిట్టనివారు ఫోన్ ద్వారా ఇలా చేసి వుంటారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.