సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 ఫిబ్రవరి 2015 (19:41 IST)

మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి కన్నుమూత!

ప్రముఖ మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి కన్నుమూశారు. అవివాహిత అయిన రాగతి చిన్నతనంలోనే పోలియో వ్యాధి బారిన పడ్డారు. అయినప్పటికీ కార్టూనిస్టుగా రాణించి.. చూడగానే నవ్వు వచ్చే విధంగా ఆమె కార్టూన్లు గీసేవారు. ఈ నేపథ్యంలో గురువారం విశాఖలో ఆమె తుదిశ్వాస విడిచారని.. మరణించేనాటికి ఆమె వయస్సు 50 సంవత్సరాలు. 
 
ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆమెను విశాఖలోని ఓ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందిన రాగతి గురువారం కన్నుమూశారు. 
 
అయితే రాగతి పండరి అవయవాలను సావిత్రిబాయి పూలే మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. మహిళలు చాలా తక్కువ సంఖ్యలో వున్న కార్టూన్ రంగంలో రాగతి పండరి గుర్తింపు పొందారు. అనేక పత్రికల్లో రాగతి కార్టూన్లు అచ్చయ్యాయి. వ్యంగ్యంగా కార్టూన్లు గీయడంతో రాగతి దిట్ట. దురాచారాల్ని ప్రశ్నిస్తూ.. హాస్యం మేళవిస్తూ కార్టూన్లు గీసిన గీత ఆగిపోయింది.