జనసేన పార్టీకి దిల్ రాజు ఇం'ధనం'గా ఉన్నారు : పవన్ కళ్యాణ్
ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నిర్మాత దిల్ రాజు ప్రశంసల వర్షం కురిపించారు. తాను కష్టాల్లో ఉన్న సమయంలో తనతో వకీల్ సాబ్ అనే చిత్రాన్ని నిర్మించి, తమ పార్టీ జనసేనకు ఇంధనంగా పని చేశారన్నారు. శనివారం రాత్రి రాజమండ్రి వేదికగా రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఇందులో పవన్ మాట్లాడుతూ, ఇక దిల్ రాజు నా 'తొలిప్రేమ' సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు, నా వద్ద డబ్బులు లేనపుడు.. ఇమేజ్ ఉన్నప్పటికీ మార్కెట్ ఉందో లోదో తెలియనపుడు దిల్ రాజు నాతో "వకీల్ సాబ్" సినిమా తీశారు. ఆ సినిమాకు ఆయన ఇచ్చిన డబ్బులే జనసేన పార్టీని నడించేందుకు ఇంధనంగా పనిచేసింది" అని గుర్తు చేశారు.
ఆ తర్వాత హీరో రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ, 'రంగస్థలం' సినిమాకు అవార్డు వస్తుందని అనుకున్నాను. గోదారి తీర ప్రాంతాల్లో జీవించకపోయినా.. అద్భుతంగా నటించాడు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్ అవుతాడు. సంకల్ప బలం, పట్టుదల, కార్యదక్షత ఉంటే.. అందరూ మెగాస్టార్ చిరంజీవిలా ఎదగొచ్చు. ఆయన అంతలా ఎదగబట్టే నేను ఈ రోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నాను.
మా అన్నయ్య చిరంజీవి షూటింగులు చేసి ఇంటికి అలిసిపోయి వచ్చేవారు. ఆ టైంలో ఖాళీగా ఉండే నేను.. ఆయన షూస్, సాక్సులు తీసి కాళ్లు తుడిచేవాడిని. ఫలానా హీరో సినిమా పోవాలని మా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. సర్వేజనా సుఖినోభవంతు అని మా తండ్రి గారు మాకు నేర్పించారు. అందరూ బాగుండాలని మేం కోరుకుంటాం' అని చెప్పారు
దర్శకుడు శంకర్ చేసిన 'జెంటిల్మన్' సినిమాను చెన్నైలో చూశాను. 'ప్రేమికుడు' సినిమాకు అమ్మమ్మతో వెళ్లాను. సామాజిక సందేశాన్ని అందిస్తూ శంకర్ సినిమాలు తీస్తుంటారు. ఈ రోజు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయికి వెళ్లారు. దానికి కొంత మంది సౌత్ దర్శకులు
కారణం. అందులో శంకర్ ఒకరు. తమిళంలో శంకర్ సినిమాలు తీసి తెలుగు వారిని మెప్పించారు. ఆయన తెలుగులో సినిమా చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకున్నాను. అది ఇప్పటికి నెరవేరింది అని అన్నారు.