1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 25 జనవరి 2018 (12:20 IST)

రథసప్తమి రోజున శ్వేతనాగు సూర్య నమస్కారం... ఫోటో

రథసప్తమి వేడుకలు బుధవారం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరిగాయి. సూర్యదేవుడిని భక్తులంతా భక్తిశ్రద్ధలతో పూజించారు. సూర్యుని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించి తరించారు. అరసవల్లి, తిర

రథసప్తమి వేడుకలు బుధవారం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరిగాయి. సూర్యదేవుడిని భక్తులంతా భక్తిశ్రద్ధలతో పూజించారు. సూర్యుని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించి తరించారు. అరసవల్లి, తిరుమలలో జరిగిన రథసప్తమి ఉత్సవాల్లో భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. 
 
ఈ నేపథ్యంలో భద్రాచలం సమీపంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఓ అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. రథసప్తమి రోజున శ్వేతనాగు, సూర్య నమస్కారం చేస్తూ కనిపించిందని అటవీ శాఖాధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో వైరల్ అవుతోంది.
 
అసలు విషయం ఏమిటంటే.. భద్రాద్రి సమీపంలోని ఏజెన్సీ ప్రాంతంలో పులులను లెక్కించేందుకు వెళ్లిన అటవీ శాఖ అధికారులకు ఓ అద్భుత దృశ్యం కనిపించింది. సూర్యోదయం సమయంలో అరుదుగా కనిపించే శ్వేతనాగం.. పడగవిప్పి.. రెండు అడుగుల మేర పైకి లేచి.. సూర్యుని వైపు నిలబడి కనిపించింది.
 
అధికారుల అలికిడి విన్నప్పటికీ, కదలకుండా అలాగే నిలబడింది. ఈ దృశ్యాన్ని అధికారులు తమ సెల్ ఫోన్లలో బంధించారు. సూర్యునిని అలా చూశాక శ్వేతనాగు పక్కనే వున్న పొదల్లోకి వెళ్లిపోయిందని అధికారులు తెలిపారు.