బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 జనవరి 2018 (14:48 IST)

మూడో టెస్ట్ : భారత ఓపెనర్లకు షాకిచ్చిన సఫారీ బౌలర్లు

జోహన్నెస్‌బర్గ్‌‌లోని వాండరర్స్‌ మైదానంలో బుధవారం సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా ఈ టెస్ట్ గెలిచి, కనీసం పరువుకాపాడుకో

జోహన్నెస్‌బర్గ్‌‌లోని వాండరర్స్‌ మైదానంలో బుధవారం సౌతాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా ఈ టెస్ట్ గెలిచి, కనీసం పరువుకాపాడుకోవాలని చూస్తోంది. మరోవైపు గెలుపుతో మంచి జోరుమీదున్న సఫారీలు భారత్‌ను వైట్‌వాష్ చేయాలని గట్టిగానే ప్రాక్టీస్ చేసింది. లాస్ట్ టెస్టు జట్టు విష‌యంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న కెప్టెన్ కోహ్లీ.. ఈ మ్యాచ్‌కు కూడా రెండు కీలక మార్పులు చేయడం జరిగింది. 
 
రోహిత్‌శర్మ స్థానంలో అజింక్య రహానే, అశ్విన్ స్థానంలో భువనేశ్వర్ కుమార్ టీమ్‌లోకి తీసుకున్నారు. ఈ లెక్కన పాండ్యాతో కలిపి ఐదుగురు పేస్‌బౌలర్లతో ఈ మ్యాచ్ బరిలోకి దిగుతుండటం విశేషం. అటు సౌతాఫ్రికా కూడా స్పిన్న‌ర్ లేకుండా బ‌రిలోకి దిగుతున్న‌ది. కేశ‌వ్ మ‌హ‌రాజ్‌ను ప‌క్క‌న‌పెట్టి పెహ్లుక్‌వాయోను టీమ్‌లోకి తీసుకుంది.
 
కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ప్రారంభంలోనే షాక్ తగలింది. సౌతాఫ్రికా పేసర్ల ధాటికి భారత ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్ చేరారు. కాగా ఫిలాందర్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి కేఎల్ రాహుల్(0) కీపర్ డికాక్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 
 
అనంతరం రబడా వేసిన బౌలింగ్‌లో మరో ఓపెనర్ మురళీ విజయ్ (8) వెనుదిరిగాడు. దీంతో ప్రస్తుతం 11 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 20 పరుగులు చేసింది. క్రీజ్‌లో విరాట్ కోహ్లీ(4), చతేశ్వర్ పుజరా(0) ఉన్నారు.
 
కాగా, ఈ మ్యాచ్ కోసం భారత్ జట్టు తరపున బరిలోకి దిగిన టీమిండియా వివరాలను పరిశీలిస్తే, విరాట్ కోహ్లీ, మురళీ విజయ్, రాహుల్, పుజారా, రహానే, పార్థీవ్ పటేల్, పాండ్యా, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, మొహ్మద్ సమి, బుమ్రాలు ఉన్నారు.