పరువు కోసం భారత్ వెంపర్లాట.. క్లీన్‌స్వీప్‌పై కన్నేసిన సఫారీలు
సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు పరువు కోసం వెంపర్లాడుతోంది. అదేసమయంలో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా మాత్రం క్వీన్ స్వీప్‌పై కన్నేసింది. మూడు టెస్ట్ సిరీస్‌లో భాగంగా, ఇప్పటికే టెస్ట్ సిరీస్‌న
సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు పరువు కోసం వెంపర్లాడుతోంది. అదేసమయంలో ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా మాత్రం క్వీన్ స్వీప్‌పై కన్నేసింది. మూడు టెస్ట్ సిరీస్‌లో భాగంగా, ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కోల్పోయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఈనెల 24వ తేదీ నుంచి మూడో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో గెలిచి తీరాలన్న పట్టుదలతో భారత్ ఉంది. ఈ మ్యాచ్‌కు హోహాన్నెస్బర్గ్ ఆతిథ్యం ఇవ్వనుంది.
కాగా, ఇప్పటికే సిరీస్‌ను దక్కించుకున్న సౌతాఫ్రికా.. లాస్ట్ టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు వరుసగా రెండు టెస్టుల్లోనూ ఓడిన టీమిండియా చివరి టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకొనే ప్రయత్నంలో ఉంది.
మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. రెండు టెస్టుల్లోనూ చోటుదక్కని రహానే.. మూడో టెస్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రాక్టీస్ సెషన్లలో రహానే ఎక్కువ టైం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయటంతో చివరి టెస్ట్‌లో చోటు దక్కడం ఖాయమనిపిస్తోంది.
చివరి టెస్టుకు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆడటం అనుమానంగానే ఉంది. నెట్ ప్రాక్టీస్‌గాయపడ్డాడు. మూడో టెస్టుకు రాహుల్ పూర్తిగా కోలుకోకపోతే.. అతని స్థానంలో మురళీ విజయ్‌తో శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశముంది.