మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 22 జనవరి 2018 (15:30 IST)

కోహ్లీ అంటే బీసీసీఐకి వెన్నులో వణుకు : కాలమిస్ట్ గువా

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వణికిపోతోందని ప్రముఖ కాలమిస్ట్, సీఓఏ మాజీ సభ్యుడు రామచంద్ర గుహ ఆరోపించారు.

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వణికిపోతోందని ప్రముఖ కాలమిస్ట్, సీఓఏ మాజీ సభ్యుడు రామచంద్ర గుహ ఆరోపించారు. ఇండియన్ క్రికెట్‌లో కోహ్లీ ముందు అందరూ పిగ్మీలే అని ఆయన తేల్చి పారేశారు. కోహ్లీకి సూపర్ హీరో స్టేటస్ ఉన్నంతకాలం భారత్ విదేశాల్లో సిరీస్‌లు గెలవలేదని స్పష్టంచేశారు. 
 
ఈమేరకు ఆయన 'ది టెలిగ్రాఫ్' పత్రికకు ఓ కాలమ్ రాశారు. ఇందులో అనేక చేదు నిజాలను వెలుగులోకి తెచ్చారు. అసలు సంబంధం లేని విషయాల్లోనూ బీసీసీఐ.. కోహ్లీ సలహాలు తీసుకుంటుందని, అతని అనుమతి లేనిదే ఏ పనీ చేయడం లేదనీ ఆ కాలమ్‌లో రాశారు. కోహ్లీని బీసీసీఐ పూజిస్తుంది. కేంద్ర కేబినెట్‌లో మంత్రులు కూడా ఆ రేంజ్‌లో ప్రధాని మోడీని కీర్తించరేమో. అతనికి సంబంధం లేని విషయాల్లోనూ కోహ్లీ మాటను బీసీసీఐ కాదనలేదు అని గుహ చెప్పారు. 
 
భారత్ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్, నేషనల్ క్రికెట్ అకాడమీలాంటి సంబంధం లేని అంశాల్లోనూ బీసీసీఐ.. కోహ్లి అనుమతి తీసుకుంటుందని రామచంద్ర గుహ తెలిపారు. ఉపఖండం బయట భారత్ పెద్దగా రాణించకపోవడానికి కారణాల్లో ఇది కూడా ప్రధానమైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు. కోహ్లీ గొప్ప ప్లేయర్, గొప్ప లీడరే కావచ్చు.. కానీ సంస్థాగతంగా తీసుకోవాల్సిన చర్యలు, మార్పులపై దృష్టిసారించకపోతే అతను విదేశాల్లో కోరుకుంటున్న సక్సెస్ సాధ్యం కాదు అని గుహ ఆ ఆర్టికల్‌లో తేల్చి చెప్పారు.