శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 16 జనవరి 2018 (10:47 IST)

బ్రాడ్‌మన్ రికార్డును సమం చేసిన కోహ్లీ.. ఇంకా సఫారీ గడ్డపై?

దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్ మ్యాన్ షోతో ఆకట్టుకుంటున్నాడు. ఈ టెస్టులో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్ట

దక్షిణాఫ్రికాతో సెంచూరియన్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్ మ్యాన్ షోతో ఆకట్టుకుంటున్నాడు. ఈ టెస్టులో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఇప్పటికే 153 పరుగులతో నిలదొక్కుకుని క్రీజులో రాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజం బ్రాడ్ మన్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. కెప్టెన్‌గా 150 ప్లస్ స్కోరును ఎనిమిది సార్లు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ రికార్డు సాధించాడు. 
 
తద్వారా గతంలో బ్రాడ్‌మన్ పేరిట వున్న రికార్డును సమం చేశాడు. ఈ రికార్డును కోహ్లీ తన 65వ టెస్టులో అందుకున్నాడు. ఈ క్రమంలో ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ రికార్డును (ఏడు సార్లు) కోహ్లీ అధిగమించాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్దనే, వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌లు కూడా కెప్టెన్‌గా ఈ ఫీట్‌ను ఏడుసార్లు సాధించారు. అయితే మొత్తం మీద టెస్టుల్లో 150 ప్ల స్కోరును కోహ్లీ తొమ్మిది సార్లు సాధించాడు. అంతేగాకుండా ఇదే మ్యాచ్‌లో కోహ్లీ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టుల్లో సెంచరీ సాధించిన ఆసియా దేశాల్లో రెండో కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. గతంలో సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా సెంచరీ సాధించాడు. మొత్తంమీద దక్షిణాఫ్రికాలో కోహ్లీకి ఇది రెండో టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం.