బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. రిపబ్లిక్ డే స్పెషల్
Written By selvi
Last Updated : సోమవారం, 22 జనవరి 2018 (14:29 IST)

రాజ్యాంగ రూప కల్పన: అమెరికా నుంచి ఆ మూడు తీసుకున్నారు..

స్వాతంత్ర్య భారత రాజ్యాంగ నిర్మాణం జరిగిన రోజునే గణతంత్ర వేడుకగా జరుపుకుంటున్నాం. 1949 నవంబరు 26వ తేదీన రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించి, శాసనంగా రూపొందించుకున్నప్పటికీ.. 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగ

స్వాతంత్ర్య భారత రాజ్యాంగ నిర్మాణం జరిగిన రోజునే గణతంత్ర వేడుకగా జరుపుకుంటున్నాం. 1949 నవంబరు 26వ తేదీన రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించి, శాసనంగా రూపొందించుకున్నప్పటికీ.. 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం 395 అధికరణలు, 22 భాగాలు, 9 షెడ్యూళ్ళతో అమల్లోకి వచ్చింది.

ఆ రోజున ప్రపంచానికి భారత దేశం నూతన గణతంత్ర రాజ్యం(రిపబ్లిక్‌)గా ప్రకటించడం జరిగింది. ఈ రాజ్యాంగ రూపకల్పనకు 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. మన భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినా.. ఇతర రాజ్యాంగాల నుంచి కొన్ని అంశాలను గ్రహించారు. 
 
వాటిలో ముఖ్యమైనవి.. 
ప్రాథమిక హక్కులు  — అమెరికా
సుప్రీం కోర్టు  —  అమెరికా
న్యాయ సమీక్షాధికారం  —  అమెరికా
భారతదేశంలో ప్రాథమిక విధులు  —  రష్యా
కేంద్ర రాష్ట్ర సంబంధాలు  —  కెనడా
అత్యవసర పరిస్థితి  —  వైమర్(జర్మనీ)
ఏక పౌరసత్వం   —  బ్రిటన్
పార్లమెంటరీ విధానం — బ్రిటన్
స్పీకర్ పదవి  —  బ్రిటన్
భారతదేశంలో ఆదేశిక సూత్రాలు  —  ఐర్లాండ్
రాష్ట్రపతి ఎన్నిక పద్దతి  —  ఐర్లాండ్
రాజ్యసభ సభ్యుల నియామకం  —  ఐర్లాండ్
 
ఇలా ఇతర దేశాల నుంచి.. ఇతర గ్రంథాల నుంచి పరిశోధనలు చేసుకున్నాక భారత పరిపాలనా మార్గదర్శ గ్రంథం ఆమోదం పొందింది. ఇలా ఆమోదం పొందిన మన రాజ్యాంగం జనవరి 26వ తేది ఉదయం 10:18 నిమిషాలకు అమలులోకి వచ్చింది.