బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. రిపబ్లిక్ డే స్పెషల్
Written By ivr
Last Modified: సోమవారం, 22 జనవరి 2018 (13:56 IST)

గణతంత్ర దినోత్సవ వేడుకలు 2018, ఎవరెవరు వస్తున్నారు?

గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 26న అట్టహాసంగా జరుగనున్నాయి. ఈ వేడుకలు ఇండియా గేట్ వద్ద నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ వేడుకలో 100కి పైగా ప్రభుత్వ ఏజెన్సీలు పాల్గొంటున్నాయి. ఇంకా పదికి పైగా ఆగ్నేయ ఆసియా దేశాల నాయకులు పాల్గొనబోతున్న

గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 26న అట్టహాసంగా జరుగనున్నాయి. ఈ వేడుకలు ఇండియా గేట్ వద్ద నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ వేడుకలో 100కి పైగా ప్రభుత్వ ఏజెన్సీలు పాల్గొంటున్నాయి. ఇంకా పదికి పైగా ఆగ్నేయ ఆసియా దేశాల నాయకులు పాల్గొనబోతున్నారు.
 
థాయ్ లాండ్, వియత్నాం, ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, మియన్మార్, కంబోడియా, లావోస్, బ్రూనే దేశాల నుంచి నాయకులు వస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనవలిసిందిగా ఆగ్నేయ ఆసియా దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానాలు పంపారు. 
 
కాగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతికి తన సందేశాన్ని జనవరి 25న ఇవ్వనున్నారు. ఆయన సందేశాన్ని ప్రసార మాధ్యమాలన్నీ ప్రసారం చేస్తాయి.