శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. రిపబ్లిక్ డే స్పెషల్
Written By chj
Last Modified: సోమవారం, 22 జనవరి 2018 (13:13 IST)

జనవరి 26న ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు... 13 శకటాలు...

అమరావతి: ఈ నెల 26న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే గణతంత్ర వేడుకల ఏర్పాట్లను వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సచివాలయం 1 బ్లాక్ మొదటి అంతస్తు సీఎస్ సమావేశ మందిరంలో సమీక్షించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్

అమరావతి: ఈ నెల 26న విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే గణతంత్ర వేడుకల ఏర్పాట్లను వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ సచివాలయం 1 బ్లాక్ మొదటి అంతస్తు సీఎస్ సమావేశ మందిరంలో సమీక్షించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగే గణతంత్ర వేడుకల నిర్వహణ బాధ్యతలను కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతంకు అప్పగించారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ నెల 25వ తేదీనే విజయవాడ వస్తారని, ఆ రాత్రికి ఇక్కడే బస చేసి, 26వ తేదీ ఉదయం వేడుకల్లో పాల్గొంటారని అధికారులు చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖల వారు 13 శకటాలను ప్రదర్శిస్తారని సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ చెప్పారు.
 
వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, పశుసంవర్థక శాఖలు, ఆర్టీసీ, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఫైబర్ నెట్, సీఆర్డీఏ, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, విద్యుత్ శక్తి, మానవ వనరులు, సర్వశిక్షఅభియాన్, ప్రాథమిక విద్య, అటవీ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, సాంఘీక సంక్షేమం, మహిళాశిశు సంక్షేమం, పర్యాటక, సాంస్కృతిక, నీటి వనరులు, ఆరోగ్య, పౌరసరఫరాలు, గృహ నిర్మాణ శాఖల వారు తమ శకటాలను ప్రదర్శిస్తారని ఆయన వివరించారు. 
 
టాయిలెట్స్, త్రాగునీటి సౌకర్యాలను పట్టణ పరిపాలన, నగరాభివృద్ధి సంస్థ వారు చూస్తారని అధికారులు చెప్పారు. పాఠశాల విద్యార్థులు, ఎన్‌సీసీ, స్కౌట్ విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. స్టేడియంలో ఆరు ట్రాన్స్‌ఫార్మర్స్ ఉన్నాయని, అత్యవసర సమయంలో ఉపయోగం కోసం ఒక జనరేటర్‌ని ఏర్పాటు చేసినట్లు ఏపీ ట్రాన్స్‌కో అధికారి తెలిపారు. మంత్రులకు, ముఖ్యులకు ఆహ్వానాలు పంపుతామని, సమాచార, పౌరసంబంధాల శాఖ వారు ఇచ్చిన జాబితా ప్రకారం మీడియా పాస్‌లు ఇస్తామని ప్రొటోకాల్ అదనపు కార్యదర్శి లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎం.అశోక్ బాబు చెప్పారు. అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నట్లు వైద్యశాఖ వారు తెలిపారు. అలాగే ఆర్టీసీ, ట్రాన్స్‌పోర్ట్, విపత్తుల నిర్వహణ(డిజాస్టర్ మేనేజ్ మెంట్), రోడ్లు, భవనాల తదితర శాఖల అధికారులు తాము చేస్తున్న పనులను వివరించారు.