శుక్రవారం, 3 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 16 సెప్టెంబరు 2025 (15:37 IST)

Barbarik: పైసా ఖర్చులేకుండా పబ్లిసిటీ వచ్చింది : విజయ్‌పాల్ రెడ్డి ఆదిదాల

Barbarik Producer Vijaypal Reddy Adidala
Barbarik Producer Vijaypal Reddy Adidala
సినిమా నిర్మాణానికి కోట్లలో ఖర్చుపెడితే అందుకు పబ్లిసిటీకి కూడా చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చిన్న సినిమాలకు చెప్పాల్సిన పనిలేదు. పబ్లిసిటీపరంగా చాలా వెచ్చించాల్సి వస్తుంది. అలాంటిది పైసా ఖర్చులేకుండా సోషల్ మీడియాలోనూ బయట పెద్ద పబ్లిసిటీ తన సినిమాకు వచ్చిందంటూ నిర్మాత విజయ్‌పాల్ రెడ్డి ఆదిదాల. ఆయన తీసిన సినిమా త్రిబనాధరి బార్బారిక్.
 
ఈ సినిమా విడుదల తర్వాత ఆదరణ లేకపోవడంతో గతంలో చెప్పినట్లు తనకుతాను చెప్పుతో కొట్టుకుంటున్నట్లు దర్శకుడు మోహన్ శ్రీవత్స సోషల్ మీడియాలో చెప్పుతో కొట్టుకోవడం జరిగింది. దానితో అది మామూలుగా వైరల్ కాలేదు. నేను సినిమాకు పెట్టిన పెట్టుబడితో వచ్చిన పబ్లిసిటీ కంటే పదింతలు వచ్చిందని నిర్మాత మనసులోని మాటను తెలియజేశారు. అసలు ఆ కథకు ఆ టైటిల్ పెట్టకూడదు అని విడుదలకుముందు సన్నిహితులు చెప్పారు. ఇదేదో డబ్బింగ్ సినిమాలా వుంది అన్నారు. కానీ డెస్టినీ అప్పటికే అంతా అయిపోయింది. ఆ సినిమా బాగుందని ప్రేక్షకులు చెప్పినా కేవలం టైటిల్ వల్లే సినిమా తీసి నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఇప్పుడు ఆ నిర్మాత టీనేజీ స్టోరీతో బ్యూటీ సినిమా తీశారు. ఈ సినిమా చూసిన ప్రముఖులు గుండెను హత్తుకునేలా వుందని ప్రశంసలు కురిపించారు. సెన్సార్ వారు కూడా ఏకగ్రీవంగా మంచి సినిమా తీశావని మెచ్చుకున్నారు. అందుకే ఈ సినిమాపై నాకు పూర్తి నమ్మకం వుందని అన్నారు. అయితే ఓజీ సినిమాకు ముందు రావడంతో థియేటర్ల సమస్యల తలెత్తలేదని అన్నారు.