మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : గురువారం, 25 జనవరి 2018 (10:11 IST)

గురువారం దినఫలాలు : ఐశ్వర్యాభివృద్ధి.. ఆరోగ్యం...(వీడియో)

మేషం : వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. చిన్నారులకు విలువైన కానుకలు అందిస్తారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. మీ సంతానం మొండితనం ఇబ్బందులకు దారితీస్తుంది. పెద్దమొత్తం ధనసహాయం క్ష

మేషం : వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. చిన్నారులకు విలువైన కానుకలు అందిస్తారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికమవుతుంది. మీ సంతానం మొండితనం ఇబ్బందులకు దారితీస్తుంది. పెద్దమొత్తం ధనసహాయం క్షేమం కాదు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. సహస ప్రయత్నాలు విరమించండి. 
 
వృషభం : వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి మరింతగా శ్రమించాలి. వాహనం నిదానంగా నడపడం శ్రేయస్కరం. కుటుంబ విషయాలపై దృష్టిసారిస్తారు. ఇంటా బయటా ప్రశాంతత నెలకొంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు సంభవం. కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. 
 
మిథునం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామిక సమావేశాలు వాయిదాపడతాయి. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోవాలి. అగ్రిమెంట్లు, డబ్బుల చెల్లింపుల్లో మెలకువ వహించండి. గిట్టని వారు మిమ్మలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తారు. 
 
కర్కాటకం : ఆర్థిక లావాదేవీలు, వ్యవహార ఒప్పందాల్లో జాగ్రత్త అవసరం. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాన్ని తక్షణం వినియోగించుకోవాలి. షాపుల అలంకరణ, కొత్త స్కీములతో క్రయ విక్రయాలు ఊపందుకుంటాయి. దంపతుల మధ్య పొత్తు పొసగదు. 
 
సింహం : ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి గౌరవమర్యాదలు, ఆదరణ లభిస్తాయి. ఆటోమొబైల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు, ఆదరణ లభిస్తాయి. పెద్దమొత్తం నగదుతో ప్రయాణాలు క్షేమంకాదు. ఇతరులపై ఆధారపడక స్వయం కృషినే నమ్ముకోవడం మంచిది. 
 
కన్య : ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించవలసి వస్తుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు. రవాణా, ప్రకటనలు, విద్యా రంగలోనివారికి శుభప్రదంగా ఉంటుంది. ఇతరుల స్థితిగతులతో పోల్చుకుని నిరుత్సాహం చెందుతారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. 
 
తుల : బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. రాజకీయాలలోని వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. విద్యార్థులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
వృశ్చికం : ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనవసరపు వాగ్ధానాలు చేసి సమస్యలను కొనితెచ్చుకోకండి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. పట్టుదలతో కార్యసాధనకు మరోసారి యత్నిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం వల్ల ఊహించని పరిణామాలను ఎదుర్కొంటారు. 
 
ధనస్సు : కాంట్రాక్టర్లు, మధ్యాహ్న భోజన పథకం ఏజెంట్లకు బిల్లులు మంజూరు కాగలవు. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత, మెళకువ అవసరం. రుణాలు తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు. ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రత్యర్థులను చిత్తుగా ఓడిస్తారు. 
 
మకరం : వృత్తుల వారికి ప్రముఖులతో సంబంధాలు మరింత బలపడతాయి. విద్యార్థులు బంజారు తినుబండరాలు భుజించుట వల్ల అస్వస్థతకు లోనవుతారు. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, కలాలు చోటుచేసుకుంటాయి. తలపెట్టిన పనులలో విఘ్నాలు, చీటికి మాటికి అసహనం ఎదుర్కొంటారు. 
 
కుంభం : ఉద్యోగస్తులకు అధికారులు, తోటివారి ప్రశంసలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీ ముందు పొగిడినా చాటుగా విమర్శిస్తారన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. క్రీడా పోటీల్లో విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీసే ఆస్కారం ఉంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. 
 
మీనం : రాజకీయాలలోని వారికి శత్రువులు అధికమవుతున్నారని గమనించండి. రాబడికి మించి ఖర్చులు అధికమవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు వాయిదా వేయవలసి వస్తుంది. మీ నుంచి విషయాలు రాబట్టేందుకు బంధువులు యత్నిస్తారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది.