బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 23 జనవరి 2018 (08:53 IST)

మంగళవారం రాశి ఫలితాలు ... అలా చేస్తే మానసిక ప్రశాంతత...

మేషం: పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. చేతివృత్తుల వారికి పు

మేషం: పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. మీ కోపాన్ని, చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. చేతివృత్తుల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. 
 
వృషభం : హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు ఎంతో అవసరం. పత్రికా, వార్తా సంస్థల్లోని వారికి ఏకాగ్రత ముఖ్యం నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ముఖ్యం. ధనం కంటే ఆత్మగౌరవానికే ప్రాధాన్యం ఇస్తారు. 
 
మిథునం: బ్యాంకు వ్యవహారాల్లో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. తరచూ తెలియక చేసిన పొరపాట్లను పశ్చాత్తాపపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. 
 
కర్కాటకం: యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మంచివారితో పరిచయం మీ అభివృద్ధికి దోహదపడుతుంది. గృహ మరమ్మతులు, మార్పులు చేర్పులు వాయిదా పడతాయి. ఒక కార్యం నిమిత్తం ఆకస్మిక ప్రయాణం చేయవలసివస్తుంది. కొద్దిగా చికాకులు ఉన్న వ్యవహారాలందు జయం పొందుతారు. 
 
సింహం: సభలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. పన్నులు, ఫీజులు, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. విద్యార్థులు పరస్పరం విలువైన కానుకలిచ్చి పుచ్చుకుంటారు. 
 
కన్య: స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు పోటీ పరీక్షల విషయంలో ఎక్కువ శ్రమించటం ద్వారానే విజయం సాధించగలుగుతారు. పత్రికా సంస్థల్లోని వారికి చిన్న చిన్న తప్పిదాలు దొర్లే సూచనలున్నాయి. బంధువుల రాక, కలయిక ఆనందాన్నిస్తుంది. స్త్రీల మనోవాంఛలు, అవసరాలు నెరవేరుతాయి. 
 
తుల: రైతులు సామాన్యమైన లాభాలను పొందుతారు. కళా రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. మొండి బాకీలు సైతం వసూలవుతాయి. స్త్రీలు అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. 
 
వృశ్చికం: కుటుంబ వాతావరణం ఆనందం కలిగిస్తుంది. భాగస్వామిక ఒప్పందాలు, స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలం. దూర ప్రయాణాల్లో చికాకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని అందిపుచ్చుకోవడం ఉత్తమం. వ్యాపార అభివృద్ధికి చేసే కృషి ఫలిస్తుంది. తాకట్టులో వున్న పత్రాలు విడిపిస్తారు. 
 
ధనస్సు: ముఖ్యమైన వ్యవహారాలు మీరే సమీక్షించుకోవడం ఉత్తమం. రుణ విముక్తులు కావడంతో మానసికంగా కుదుటపడతారు. బంధువుల రాక సంతోషాన్నిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. రచయితలు, పత్రికా రంగంలోని వారికి, కళారంగంలోని వారికి ప్రోత్సాహం లభిస్తుంది. 
 
మకరం : బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. అనవసర విషయాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్న వారికి అనుకూలమైన కాలం. మీ నూతన పథకాలు క్రియా రూపంలో పెట్టి జయం పొందండి. సంఘంలో మీ మాటపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. 
 
కుంభం: సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. మీ ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి వుంటుంది. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగాల వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. 
 
మీనం :  సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. వాతావరణంలోని మార్పు రైతులకు ఆందోళన కలిగిస్తుంది. వాహన చోదకులకు ఇబ్బందులు తప్పవు.